Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ABN, First Publish Date - 2023-06-07T16:17:35+05:30
అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జూన్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). మే 12న థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే కానిస్టేబుల్ శివగా అండర్ డాగ్ పాత్రలో నాగ చైతన్య ఈ చిత్రంలో నటించారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించగా.. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో జూన్ 9 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా తెలియజేసింది. నాగ చైతన్య కెరీర్‌లో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది. మేకర్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీలో భారీ స్పందనను రాబట్టుకుంటుంది, ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. (Custody Movie OTT Release Details)
ఇక ‘కస్టడీ’ స్టోరీ (Custody Story) విషయానికి వస్తే.. ఈ కథ 1996లో జరిగింది. శివ (నాగ చైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్, ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) పర్యటనలో బందోబస్తుకు వెళతాడు. అక్కడ ఒక అంబులెన్స్‌కి దారి ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఆపేస్తాడు, అతనికి డ్యూటీ అంటే ప్రాణం అందుకే అలా చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా అతని ప్రవర్తనకి మెచ్చుకుంటుంది, ప్రశంసిస్తుంది. శివ ఫోటో, పేరు పేపర్లో వేస్తారు. శివకి రేవతి (కృతి శెట్టి) అనే ప్రియురాలు ఉంటుంది, ఆమె కారు డ్రైవింగ్ నేర్పుతూ ఉంటుంది. కానీ రేవతి తల్లిదండ్రులు శివతో వివాహానికి ఒప్పుకోరు, ఇంకో అబ్బాయి (వెన్నెల కిశోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. రేవతికి ఆ పెళ్లి ఇష్టం లేదు, అందుకని శివని తనని తీసుకుపోయి పెళ్లిచేసుకో, లేదంటే చస్తా అంటుంది.
ఇదిలా ఉంటే, శివ డ్రంకెన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ను అరెస్టు చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లాకప్‌లో పడేస్తాడు. మొదట్లో శివ నమ్మకపోయినా, జార్జ్ ఇచ్చిన నంబర్‌కి ఫోన్ చేసి అతను సిబిఐ ఆఫీసర్ అని నమ్ముతాడు. ఈలోగా రాజును, జార్జ్‌ని స్వయంగా పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) పోలీస్ ఫోర్స్‌తో రౌడీలతో వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రాజు ఎవరు, ఎందుకు అతన్ని పోలీసులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్లందరి వెనకాల వున్నది ఎవరు? సిబిఐ ఆఫీసర్ ఎందుకు రాజుని సేవ్ చేసి తనతో తీసుకు వెళ్ళాలి అనుకుంటాడు. రాజు ఎన్నో మర్డర్‌లు చేసినా, బాంబులదాడితో చాలామంది ప్రాణాలు తీసినా, శివ ఎందుకు అతన్ని కాపాడాలి అనుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ‘కస్టడీ’ కథ.
ఇవి కూడా చదవండి:
************************************************
*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?
*Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!
*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం
*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..
*Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్.. ఇప్పుడిదే హాట్ టాపిక్