Miss Shetty Mr. Polishetty - OTT Date : ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. !
ABN, First Publish Date - 2023-09-30T17:50:58+05:30
అనుష్క(anushka), నవీన్ పొలిశెట్టి (Naveen polishetty) కీలక పాత్రల్లో పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ ఇప్పుడు చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.
అనుష్క(anushka), నవీన్ పొలిశెట్టి (Naveen polishetty) కీలక పాత్రల్లో పి.మహేశ్‌బాబు (P Maheshbabu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty). యు.వి.క్రియేషన్స పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చి ఓ సెక్షన ఆడియన్సను అలరించి ఫర్వాలేదనిపించింది. అనుష్క నటన, నవీన పోలిశెట్టి కామెడీ టైమింగ్ సినిమాను సక్సెస్బాటలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ర్టీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. (OTT Release)
కథ: అన్వి అలియాస్ అన్విత రవళి శెట్టి (అనుష్క) మాస్టర్ చెఫ్. లండన్‌లో ఓ పెద్ద స్టార్ హోటల్లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడమే. కొంతకాలానికి తన తల్లి అనారోగ్యంతో కన్నుమూయడంతో అన్వి ఒంటరి అవుతుంది. దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే డేరింగ్ డెసిషన తీసుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మను ఇవ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్ కమెడీయన సిద్ధూ పొలిశెట్టి (నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలు సిద్థులో కనిపించడంతో అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడుతుంది. సిద్థు ఓ రోజు తనకు ప్రపోజ్ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్థుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది. అయితే ఆమె నిర్ణయం తెలిసి సిద్థు ఒక్కస?రిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్థమని తన అభిప్రాయాన్ని చెబుతాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. దీంతో కోపగించిన అన్వి అతన్ని దూరం పెడుతుంది. చివరికి అన్విత తాను అనుకున్నది సాధించిందా? ఆమె భారత నుంచి లండనకు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను సిద్ధూ ఎలా మార్చాడు? చివరికి ఏమైంది అన్నది కథ.