Waltair Veerayya: ఓటీటీలోకి వచ్చేసిన మెగాస్టార్ మూవీ.. ఇక ఇంట్లోనూ పూనకాలే..
ABN, First Publish Date - 2023-02-27T09:28:02+05:30
‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).
‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. పండగకి రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ అయిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల అవ్వగా.. చిరు మూవీ విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీ ఓవరాల్‌గా దాదాపు రూ.250 కోట్లు.. ఓవర్సీస్‌లోనూ 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘వాల్తేరు వీరయ్య’ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నేటి (ఫిబ్రవరి 27న) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ మూవీలో రవితేజ, చిరంజీవి మధ్యలో వచ్చే సీన్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, చాలామంది సినీ లవర్స్‌కి ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూడడం కుదరలేదు. అలాంటి వారందరూ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ఇది కూడా చదవండి: