PonniyinSelvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 కూడా ఓటిటి లోకి వచ్చేసింది, కానీ...
ABN, First Publish Date - 2023-05-26T15:12:49+05:30
మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ కాంబినేషన్లో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' రెండో పార్టు కూడా ఇప్పుడు ఓటిటి లో ప్రసారం అవుతోంది. ఇది విడుదల అయి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
మణిరత్నం (ManiRatnam) దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' #PonniyinSelvan రెండు పార్టులుగా విడుదల అయిన సంగతి తెలిసిందే. మొదటి పార్టు అప్పుడెప్పుడో విడుదలయింది, ఓటిటి లో కూడా వచ్చేసింది. రెండో పార్టు 'పొన్నియిన్ సెల్వన్ 2' లేదా 'పీస్ 2' #PS2 ఏప్రిల్ 28 న థియేటర్లో విడుదల అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో చాలామంది తమిళ నటులు విక్రమ్ (ChiyaanVikram), కార్తీ (Karthi), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (AishwaryaRaiBachchan), త్రిష(Trisha), జయం రవి, శరత్ కుమార్, పార్తీపన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ (SobhitaDhulipala), జయరామ్, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్ (PrakashRaj) లు ముఖ్యపాత్రలో కనపడతారు. ఇపుడు ఈ రెండో పార్టు కూడా ఓటిటి లో వచ్చేస్తోంది.
ఈ 'పొన్నియిన్ సెల్వన్ 2' చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో (AmazonPrimeVideo) స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే ఇది ఫ్రీగా చూడటానికి అవదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో చూపిస్తున్నారు కానీ, కేవలం అద్దెకు తీసుకొని మాత్రమే చూడాలి. అందుకనే ఈ సినిమా విడుదల అయి నెల రోజులు కూడా కాకముందే ఓటిటి లో వచ్చేస్తోంది అంటే, అందుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది చూడాలంటె ఎవరైనా రూ 399 చెల్లించి చూసుకోవచ్చు. ఇంకో షరతు వుంది, ఏంటంటే డబ్బులు చెల్లించాక కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను చూసెయ్యాలి, లేదంటే కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి.
దక్షిణ భారత దేశ భాషలు అన్నిటిలో ఈ సినిమాని చూసుకోవచ్చు ఈ డబ్బులు కట్టి. ఈ రెండు పార్టుల హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ 100 కోట్లకు తీసుకుందని అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఈ రెండో పార్ధుకి అద్దె కట్టి చూసుకోండి అని చెపుతున్నారు అని తెలిసింది. అయితే ఈ అద్దె విధానం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాక, జూన్ 26 నుంచి మాత్రం ఉచితంగా చూసే అవకాశాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇస్తుంది అని తెలిసింది.
'పొన్నియిన్ సెల్వన్ ' మొదటి పార్టు గతేడాది సెప్టెంబర్ లో విడుదలై విజయం సాధించింది. ఇటీవల విడుదలైన రెండో పార్టు మొదటి పార్టు అంత కాకపోయినా, బాగానే నడిచింది అన్నారు. దీనికి ఎఆర్ రెహమాన్ (ARRahaman) సంగీతం అందించారు.