కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mangalavaram on OTT: తేదీ వచ్చేసింది, ఇక ఇంట్లోనే ఈ హర్రర్ మూవీని చూసుకోవచ్చు

ABN, Publish Date - Dec 23 , 2023 | 05:21 PM

థియేటర్స్ లో ప్రేక్షకులని భయపెట్టిన 'మంగళవారం' సినిమా ఇక ఇంట్లో చూసుకోవచ్చు. ఈ సినిమా ఈరోజు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో వివరాలు కింద వున్నాయి, చదువుకోండి.

Mangalavaaram is now going to stream on an OTT

దర్శకుడు అజయ్ భూపతికి 'ఆర్ఎక్స్ 100' మొదటి సినిమా, అది పెద్ద విజయం సాధించింది, పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత అతను 'మహా సముద్రం' అనే సినిమా చేసాడు, కానీ అది పెద్దగా హిట్ కాలేదు. అందులో శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి ఇద్దరు మంచి నటులున్న, అదితి రావు హైదరి లాంటి నటి వున్నా ప్రేక్షకులు ఎందుకో పట్టించుకోలేదు. ఆ తరువాత సినిమానే ఈమధ్యనే విడుదలైన 'మంగళవారం'. ఇది నవంబర్ 17న థియేటర్స్ లో విడుదలైంది.

ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. అజయ్ భూపతి మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100' లో చేసిన పాయల్ రాజ్‌పుత్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. స్వాతి, సురేశ్ వర్మ నిర్మాతలు. ఇంకా నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై లు ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ఈ మంగళవారం సినిమా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ లు ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా మీద అంచనాలు పెంచింది. ఈ సినిమాలో అజయ్ భూపతి చాలామంది ఆర్టిస్టులను తెలుగు తెరకి పరిచయం చేశారు కూడా. ఇప్పుడు ఈ సినిమా ఇంట్లోనే చూసుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది, ఎప్పుడంటే డిసెంబర్ 26 నుండి. థియేటర్స్ లో విడుదలైనప్పుడు ఈ సినిమాని అందరూ ప్రశంసించారు, దర్శకుడు అజయ్ భూపతికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా డిసెంబర్ 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Dec 23 , 2023 | 05:56 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!