Remya Nambeesan: మలయాళంలో 'ఊ అంటావా మావా' పాట పాడిన ఈమెకి ఏ తెలుగు హీరో ఇష్టమో తెలుసా?
ABN, First Publish Date - 2023-08-01T16:48:30+05:30
మలయాళం నటి రమ్య నంబీషన్ ఇప్పుడు తెలుగులో 'దయా' అనే వెబ్ సిరీస్ తో పరిచయం అవుతోంది. ఈమె గాయని కూడా, 'పుష్ప' సినిమాలో 'వూ అంటావా మావా' పాటని 'పుష్ప' మలయాళం వెర్షన్లో పాడి అక్కడ పెద్ద హిట్ అయింది. జేడీ చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తున్న 'దయా' వెబ్ సిరీస్ తో తెలుగులోకి వస్తోంది.
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా (EeshaRebba), కమల్ కామరాజ్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ #Dayaa ఆగస్ట్ 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (DisneyPlusHotStar) స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో మలయాళం నటి నంబీషన్ రమ్య (RemyaNambeesan) ఒక ప్రముఖ పాత్ర, జర్నలిస్ట్ గా కనిపించనుంది. పవన్ సాధినేని దీనికి దర్శకుడు. తమిళ, మలయాళ చిత్రాలు ఎక్కువగా చేసిన రమ్య, ‘దయా’తో తెలుగులోకి వస్తోంది. ఇందులో ఆమె కవిత అనే జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది అని చెప్పింది. దర్శకుడు పవన్ ఈ కథను ఆమెకి చెప్పినప్పుడు ఆమె షాక్ అయింది అని అంటోంది. ఎందుకంటే ఇలా తెలుగు పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదట.
ఇంతకు ముందు తెలుగులో 'సారాయి వీర్రాజు' అని ఓ సినిమా చేసిన రమ్య తనకి నచ్చే పాత్రలు ఎక్కువగా రాకపోవడంతే తెలుగు సినిమాలు చేయలేదు అని చెప్తోంది. అందుకే తమిళం, మలయాళంలో చేసింది, ఇప్పుడు ఈ 'దయా' #DayaWebSereis వెబ్ సిరీస్ ఏడు భాషల్లో రిలీజ్ అవుతోంది. జేడీ చక్రవర్తి (JDChakravarthy) గారి పక్కన ఉంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది, కానీ ఆయనతో రమ్యకి ఎక్కువ సీన్లు లేవుట. కానీ జేడీ తో కలిసి మళ్ళీ నటించాలని ఉంది, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది అని చెప్పింది రమ్య. తెలుగు ఎవరంటే ఇష్టం అని అడిగితే "నాకు తెలుగులో నాని అంటే ఇష్టం" అని చెప్తోంది ఈ మలయాళ భామ.
ఈమె చేసిన కవిత జర్నలిస్ట్ పాత్ర చాలా ఇంటెన్స్, సీరియస్ అని, ఇంతవరకు ఇలాంటి పాత్రను చేయలేదు అని చెప్తోంది. ఓ లేడీ జర్నలిస్ట్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయ్ అనేది చక్కగా చూపించారు. దయా అనేది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అని అంటోంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం రావడంతో చాలా మందికి అవకాశాలు పెరిగాయి అని చెపుతూ ఓటీటీ అనేది ఓ గొప్ప పరిణామం అని అంటోంది.
అలాగే రమ్య గాయని కూడాను. అల్లు అర్జున్ (AlluArjun) అంటించిన 'పుష్ప' #Pushpa సినిమాలో 'ఊ అంటావా మావా' (Oo antava mava) పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే, అదే పాటని రమ్య అదే సినిమా కోసం మలయాళంలో పాట పడింది. అయితే మలయాళంలో కూడా అంత పెద్ద హిట్ అవుతుందని ఆమె అనుకోలేదు అని చెప్తోంది. అదంతా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (DeviSriPrasad) వల్లే జరిగింది. అలాగే విజయ్ దేవరకొండ (VijayDeverakonda), రష్మిక మందన్న (RashmikaMandanna) లు నటించిన 'డియర్ కామ్రేడ్' #DearComrade సినిమాలోనూ మలయాళీ వర్షెన్‌కు ఓ పాట పాడాను అని చెప్తోంది రమ్య.