OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN, First Publish Date - 2023-01-13T09:44:17+05:30
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. జనవరి 12న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
చెప్పాలని ఉంది (Cheppalani Undi)
చందు అనే యువకుడు ఓ తెలుగు మీడియాలో రిపోర్టర్. అతను వెన్నెల అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వెన్నెల తండ్రికి తనకి కాబోయే అల్లుడు అచ్చ తెలుగులో మాట్లాడాలనే నియమం ఉంటుంది. అయితే.. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన చందు ఏదో విచిత్రమైన భాషలో మాట్లాడుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తాడు. దాని వల్ల అతని జీవితంలో ఎదురైన సంఘటన సమాహారమే ‘చెప్పాలని ఉంది’ చిత్రం. యశ్ పురీ, స్టేఫీ పటేల్, సత్య, పృథ్వీ రాజ్, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Kung Fu Panda: The Dragon Knight Season 2 - ఇంగ్లిష్
Vikings: Valhalla Season 2 - ఇంగ్లిష్
Scattered Barriers - అరబిక్
The Makanai: Cooking for the Maiko House - జపనీస్
షామారో మీ (Shemaroo Me)
Bairaono Bahubali - గుజరాతీ