Leo: ఓటీటీలోకి.. లియో అన్‌కట్ వెర్షన్
ABN, First Publish Date - 2023-10-31T16:58:00+05:30
దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన వెర్షన్‌ను కాకుండా అన్‌కట్ వెర్షన్‌ను ఓటీటీలోకి తేనున్నట్లు లోకేష్ ఇటీవల ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
దళపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో ఎల్సీయూలో భాగంగా వచ్చిన మూడవ చిత్రం లియో (LEO). దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమాలో అర్జున్ సర్జా, సంజయ్‌దత్(sanjay dutt), త్రిష(Trisha Krishnan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించగా అనిరుధ్ సంగీతం అందించారు.
సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ఇప్పటివరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అతి తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మొదటి తమిళ చిత్రంగా రికార్డులకెక్కింది. తెలుగులో సినిమా విడుదలైన మొదటి వారంలోనే ఇక్కడి నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని తీసుకురావడమే గాక ఆపై మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా సినిమాలో విజయ్ నటన, ఫస్టాప్‌లో వచ్చే ఫైటింగ్,హైనా సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమా ఫ్లాష్‌బ్యాక్ కన్ఫ్యూజన్‌తో కొన్నిచోట్ల మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో సక్సెస్ కాలేకపోయింది. ఈ విషయాన్ని లోకేష్ సైతం అంగీకరించాడు.
అయితే మేకర్స్ సినిమా విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నెలలోపే చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో నవంబర్ మూడో వారంలో లియో ఓటీటీ (Leo OTT)లోకి రానుంది. అయితే సినిమా విషయంలో పబ్లిక్ నుంచి వచ్చిన కామెంట్స్, సూచనల మేరకు దర్శకుడు లోకేశ్ అన్ని రకాల వర్గాల ప్రజలకు నచ్చేవిధంగా తీసుకువస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
థియేటర్లలో విడుదలైన వెర్షన్‌ను కాకుండా చాలా మార్పులు చేసి సరికొత్త వెర్షన్‌ను ఓటీటీలోకి తేనున్నట్లు లోకేష్ ఇటీవల ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. 2 గంటల 45 నిమిషాల రన్నింగ్ టైమ్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మరికొన్ని కొత్త సన్నివేశాలను జత చేసి అన్‌కట్ వెర్షన్ 3గంటల 6 నిమిషాల నిడివితో తేనున్నట్లు స్పష్టం చేశారు