Puli Meka Trailer: ఆ మేడమ్ చాలా డేంజర్ కొడ్తుంది
ABN, First Publish Date - 2023-02-20T22:53:16+05:30
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ఆది సాయి కుమార్ (Aadi Saikumar), సిరి హన్మంత్ (Siri Hanmanth) ప్రధాన పాత్రల్లో కోన ఫిల్మ్ కార్పొరేషన్ (Kona Film Corporation)తో కలిసి
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ఆది సాయి కుమార్ (Aadi Saikumar), సిరి హన్మంత్ (Siri Hanmanth) ప్రధాన పాత్రల్లో కోన ఫిల్మ్ కార్పొరేషన్ (Kona Film Corporation)తో కలిసి ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 (Zee 5) నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘పులి మేక’ (Puli Meka). సీరియల్ థ్రిల్లర్స్‌కి, సైకో కిల్లర్ వెబ్‌సీరీస్‌లకి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్‌డౌన్‌లో మొదలైన ఈ ఫీవర్, సిరీస్ లవర్స్‌లో ఇంకా తగ్గలేదు. అలాంటి వారికి ఈ ‘పులి మేక’ డబుల్ థ్రిల్లింగ్ కలిగించనుందని అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను డైరెక్టర్ బాబీ (Bobby), హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) విడుదల చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్.. రేసీ నెరేషన్ సిరీస్ మీద స్పెషల్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.
ట్రైలర్‌ను గమనిస్తే... ‘‘చావు చెప్పిరాదు, వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మొదలైందీ పులిమేక ట్రైలర్. ఆ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి. డైలాగ్ వినగానే భగవద్గీత గుర్తుకొస్తుంది. ఒన్‌మంత్ బ్యాక్ షామిర్‌పేట్ లేక్ దగ్గర ఎస్ ఆర్ నగర్ ఎస్ ఐ అనిల్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది, ఈ మర్డర్ చేసింది ఒక్కరే సార్ అని చెబుతూ ప్రభాకర్ శర్మ కేరక్టర్‌లో పరిచయమవుతారు ఆది. పోలీస్ అఫిషియల్‌గా కనిపిస్తారు సుమన్. ఆయన మాటలను బట్టి ఒక సైకో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడని అర్థమవుతుంది. ఈ కేసును డీల్ చేయడం కోసం అపాయింట్ అవుతుంది ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ కేరక్టర్‌లో లావణ్య. సీరియస్ లుక్స్‌లో, ఖాకీ యూనిఫార్మ్‌కి కరెక్ట్‌గా సెట్టయిందీ భామ. తనకంటూ ఓ టీమ్‌ని సెలక్ట్ చేసుకుని ఈ కేసును డీల్ చేస్తున్న ఆమెకు.. సాయం చేస్తాడు ప్రభ. పులి, మేక కథలో.. నువ్వు చెప్పి పులి ఎవరో తెలియాలి అంటూ జరిగే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. జంతువులాంటి మనిషి కోసం కిరణ్ ప్రభ అండ్ ప్రభాకర్ టీమ్ చేసే ప్రయత్నం ఫలించిందా? ఆ మేడమ్ చాలా డేంజర్ కొడ్తుంది అని అనుకునేవాళ్ల ఫీలింగ్స్ నిజమయ్యాయా? లాక్‌డౌన్‌లో ప్రభాకర్ చూసిన సిరీస్‌ల వల్ల కేసుకు ఏమైనా హెల్ప్ జరిగిందా?’’ వంటి ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో ఈ సిరీస్ రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ చెప్పేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. (Puli Meka Web Series Trailer)