Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:31 PM
యంగ్ హీరో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా ఓటీటీ ప్రకటించింది.
యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని (Teja Marni) తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ (Kotabommali PS). శ్రీకాంత్ (Srikanth), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ వదిలారు. రాబోయే సంక్రాంతికి ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ (Aha OTT)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డేట్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ.. సంక్రాంతికి ఆహా ఓటీటీలో అనేది మాత్రం కన్ఫర్మ్ చేశారు.
‘కోటబొమ్మాళి PS’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘కోటబొమ్మాళి PS’ కథ విషయానికి వస్తే.. (Kotabommali PS Story)
ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి నియోజక వర్గానికి ఉపఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అధికార పార్టీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎలా అయినా అక్కడ గెలవాలని అనుకుంటుంది. అందుకు హోమ్ మినిస్టర్ జయరాం (మురళీ శర్మ)ని పంపి చూసుకోమని పార్టీ చెపుతుంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలో వున్న కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పనిచేసే రామకృష్ణ (శ్రీకాంత్), కానిస్టేబుల్ కుమారి (శివాని రాజశేఖర్), కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్) అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. చనిపోయిన అతను ఒక సామాజిక వర్గానికి చెందిన వాడు అవటంతో, వాళ్ళు ఈ ముగ్గురి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు. సస్పెండ్ చేయకపోతే పోలింగ్‌ను బహిష్కరిస్తామని బెదిరిస్తారు ఆ సామజిక వర్గానికి చెందిన ఓటర్లు. వాళ్ళ ఓట్లే కీలకం కావటంతో, హోమ్ మినిస్టర్ 24 గంటల్లో ఆ ముగ్గురు అధికారులని అరెస్టు చేసి చూపిస్తా అని హామీ ఇస్తాడు. ఈ ఘటన పోలింగ్ రెండు రోజుల ముందు జరుగుతుంది. హోమ్ మినిస్టర్ డిజీపీ (బెనర్జీ) ని పిలిచి ఎలా అయినా ఆ ముగ్గురినీ 24 గంటలలోగా పట్టుకొని అరెస్టు చేయాలని ఆదేశిస్తాడు. అందుకు స్పెషలిస్ట్ అయినా ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) ని నియమిస్తారు. ఆమె ఈ ముగ్గురినీ పట్టుకోవడానికి ఒక టీముని ఏర్పాటు చేసుకొని బయలుదేరుతుంది. ఈ ముగ్గురినీ ఆమె పట్టుకోగలిగిందా, పోలింగ్ రోజు ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ కోసం హోమ్ మంత్రి ఏమి చేసాడు? ఇంతకీ ఈ ముగ్గురినీ డిపార్టుమెంట్ ఏమి చేసింది? రాజకీయ చదరంగంలో పావులుగా ఎవరు మారారు? దీనిలో కొందరి జీవితాలు ఎలా ముడిపడ్డాయి? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథ.
ఇవి కూడా చదవండి:
====================
*Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?
************************************
*NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..
********************************
*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
**************************
*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి
**************************