Planet Killers: హైదరాబాదీ జర్నలిస్ట్ పుస్తకం ఆధారంగా వెబ్‌సిరీస్
ABN, First Publish Date - 2023-04-01T19:32:56+05:30
పర్యావరణ నేరాలపై ‘ప్లానెట్ కిల్లర్స్’ (Planet Killers) టైటిల్‌తో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. హ్యుగో వ్యాన్ అఫెల్ (Hugo Van Offel) షోకు దర్శకత్వం వహించారు. మార్టిన్ బౌడౌట్ (Martin Boudot) నిర్మాతగా వ్యవహరించారు.
పర్యావరణ నేరాలపై ‘ప్లానెట్ కిల్లర్స్’ (Planet Killers) టైటిల్‌తో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. హ్యుగో వ్యాన్ అఫెల్ (Hugo Van Offel) షోకు దర్శకత్వం వహించారు. మార్టిన్ బౌడౌట్ (Martin Boudot) నిర్మాతగా వ్యవహరించారు. హైదరాబాదీ సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల రాసిన ‘బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్’ (Blood Sanders The Great Forest Heist) పుస్తకం ఆధారంగా ఈ షోను నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్ ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది. రాత్రి 9గంటలకు, 9.50 గంటలకు రెండు డాక్యుమెంటరీలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ షోలో కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ (Shahul Hameed) నేరాలను చూపించబోతున్నారు. షాహుల్ ఆంద్రప్రదేశ్‌లో కలపను స్మగ్లింగ్ చేశారు. ఇంటర్ పోల్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఆయన ఒకరు. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ సిరీస్‌లో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల కూడా కనిపించనున్నారు.
హ్యుగో వ్యాన్ అఫెల్ వెబ్‌సిరీస్ గురించి వివరించారు. ‘‘ఎపిసోడ్‌లో భాగంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో కలసి పనిచేసే అవకాశం మాకు వచ్చింది. ‘బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్’ (Blood Sanders The Great Forest Heist) పుస్తకాన్ని ఆయన రాశారు. ఎపిసోడ్ రూపకల్పనలో ఈ పుస్తకం బాగా ఉపయోగపడింది’’ అని హ్యుగో వ్యాన్ అఫెల్ చెప్పారు.
షాహుల్ హమీద్ కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్. తమిళనాడుకు చెందినవారు. ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. ఏపీ పోలీస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2016 నుంచి వెతుకుతున్నారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. షాహుల్ హామీద్ ఎపిసోడ్‌ను హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, చెన్నై, శేషాచలం అడవులు, సింగపూర్, దుబాయ్‌లో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్‌లో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో పాటు అనేకమంది మాజీ పోలీసు అధికారులు, డీఆర్ఐ అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించనున్నారు. షాహుల్‌కు తమిళ్, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ భాషలు వచ్చునని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఆయన భారీగానే ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Pushpa: The Rule: డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్!
Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..
SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ
Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?
SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..