కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Game Of Thrones: అబ్బా సాయిరాం.. మొత్తానికి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తెలుగు వ‌చ్చేసింది

ABN, First Publish Date - 2023-11-07T19:50:35+05:30

మొత్తానికి తెలుగు సినీ అభిమానులు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వీపరీతమైన క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇప్పుడు ఈ సిరీస్‌ తెలుగుతో పాటు మ‌రిన్ని భాష‌ల్లో అనువాద‌మై ఈ రోజు నుంచి ప్ర‌సారం అవుతున్న‌ది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Game Of Thrones

అబ్బా సాయిరాం.. మొత్తానికి తెలుగు సినీ అభిమానులు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వీపరీతమైన క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’(Game Of Thrones). మొట్ట‌మొద‌టి సారిగా 2011లో హెచ్‌బీవో(HBO)లో ప్రారంభమైన ఈ సిరీస్ అప్ప‌ట్లో సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. 73 ఎపిసోడ్స్‌గా ప్ర‌సామైన ఈ సిరీస్ 2019లో ముగియ‌గా దీనికి కొన‌సాగింపుగా హౌజ్ ఆఫ్ డ్రాగ‌న్స్ పేరిట మ‌రో కొత్త సీజన్ 2022లో ప్రారంభ‌మైంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌ తెలుగుతో పాటు మ‌రిన్ని భాష‌ల్లో అనువాద‌మై ఈ రోజు నుంచి ప్ర‌సారం అవుతున్న‌ది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

జాన‌ప‌ద క‌థా ఇతివృత్తంగా ఫాంట‌సీ,యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌, ట్రాజెడీ డ్రామాగా సాగే ఈ సిరీస్‌ను బోల్డ్ ఆండ్ ర‌స్టిక్‌గా తెర‌కెక్కించారు. దీంతో ఫ‌స్ట్ ఎపిసోడ్ నుంచే ఈ సిరీస్‌ ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా యూత్‌లో తెగ క్రేజ్‌ను సంపాదించుకుని సీజ‌న్‌ సీజ‌న్‌కు వీక్ష‌కుల‌ను పెంచుకుంటూ పోతూ కొత్త పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా సాగింది. ఇందులో న‌టించిన వారు కూడా రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సిరీస్‌కు వీప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ మ‌న దేశంలో కేవ‌లం మెట్రో న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ సిరీస్ వ‌చ్చే స‌మ‌యానికి మ‌న దేశంలో ఇంర్‌నెట్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉండ‌డం, హెచ్‌బీవో వంటి ఛాన‌ల్స్, వెబ్ సిరీస్‌ల గురించి మ‌న జ‌నానికి అంత‌గా అవ‌గాహ‌న లేక మ‌న వారికి చేర‌డానికి స‌మ‌యం ప‌ట్టింది.


2014,15 త‌ర్వాత మ‌న దేశంలో ఇంట‌ర్నెట్ వాడ‌కం కూడా రెండింత‌లు రెట్టింపై ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌తి ఒక్క‌రి చేతిలోకి వ‌చ్చేసింది. అనంత‌రం క‌రోనాతో ఓటీటీల ప్రాబ‌ల్యం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పెరిగి ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల‌ సిరీస్‌లు, సినిమాలు ప్ర‌తి ఇంటికి చేరాయి. ఈ క్ర‌మంలో వీక్ష‌కుల‌ను మరింతగా ఆక‌ర్షించేందుకు ఓటీటీ సంస్థ‌లు ఇత‌ర లాంగ్వేజుల్లో ఉన్న కంటెంట్‌ను అన్ని భాష‌ల్లోకి తీసుకురావ‌డం ఆరంభించాయి.

ఇదే స‌మ‌యంలో అప్ప‌టివ‌ర‌కు ఎటువంటి కంటెంటు లేకుండా ఉన్న జియో సినిమా(Jio Cinema) ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల‌ను కొనుగోలు చేసి వెలుగులోకి వ‌చ్చింది. ఇదే క్రేజ్‌లో ఓటీటీకి మ‌రింత‌గా ప్రాచూర్యం క‌ల్పించేందుకు గాను ఇంట‌ర్‌నేష‌న‌ల్‌గా గుర్తింపు ఉన్న‌ హెచ్‌బీవో (HBO), మ‌రికొన్ని డిజిట‌ల్ సంస్థ‌ల‌ను వీలినం చేసుకుని అందులోని కంటెంటును ద‌క్కించుకుని అప్ప‌టికే ఆద‌ర‌ణ ఉన్న షోల‌ను వారి వారి భాష‌ల్లోకి డ‌బ్బింగ్ చేసి ప్ర‌సారం చేయ‌డం ప్రారంభించింది.

ఈక్ర‌మంలో ఈ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌ను జియో సినిమా ఈ రోజు(న‌వంబ‌ర్ 7) నుంచి ఓటీటీ వీక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీంతో చాలామంది నెటిజ‌న్స్ ఫుల్ ఖుషీ అవుతూ మొత్తానికి వ‌చ్చేసింది రా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సిరీస్ చూడాలనుకునే వారు తప్పనిసరిగా జియో సినిమా సబ్ స్క్రిప్సన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ గురించి మీకు తెలియదా .. అయితే ఇప్పుడే వెళ్లి చూసేయండి మరి.

Updated Date - 2023-11-07T20:06:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!