OTT-movies-webseries: ఈ సినిమాలు, వెబ్ సిరీస్ ఎక్కడ చూడొచ్చు
ABN, First Publish Date - 2023-03-16T16:20:47+05:30
ప్రతి శుక్రవారం థియేటర్ లో విడుదల అయినట్టే, ఓ.టి.టి లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. ఈ వారం విడుదల అవబోయే, అయ్యే కొన్ని ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్
ప్రతి శుక్రవారం సినిమాలు ఎలా థియేటర్ లో విడుదల అవుతున్నాయో, అలాగే ఓ.టి.టి ప్లేట్ ఫార్మ్ లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. థియేటర్ లో శుక్రవారం విడుదల అయిన సినిమాలు, ఓ.టి.టి లో శుక్రవారమే విడుదల అవుతూ ఉండటం ఆసక్తికరం.
సినిమా: సార్ (నెట్ ఫ్లిక్స్)
తమిళ నటుడు ధనుష్ (Dhanush) తొలి సారిగా తెలుగు చిత్రం అయిన ఈ 'సార్' (Sir) తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) దీనికి దర్శకుడు కాగా సంయుక్త మీనన్ (Samyukta Menon) కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేటర్ లో విడుదల అయి మంచి విజయం సాధించింది కూడా. ఇందులో 'మాస్టారు మాస్టారు' పాట ఈరోజుకి కూడా అందరి నోటా వినబడుతోంది. ఈ సినిమాలో ధనుష్ ఒక ఉపాధ్యాయుడిగా కనపడతాడు. విద్య నేపధ్యం లో సాగే సినిమా కథ ఇది. విద్య కొంతమంది కోటేశ్వరాల చేతుల్లోకి వెళ్ళిపోయి, ప్రైవేట్ పాఠశాలలు పెట్టి ఎక్కువ ఫీజులతో డబ్బులు సంపాదిస్తుంటే, ప్రభుత్వ పాఠశాల్లలో చాలా తక్కువ ధరకే మెరుగయిన విద్య వస్తుంది అని చాటి చెప్పే సినిమా ఇది. ప్రైవేట్ పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలకు మధ్య నడిచే ఒక ఛాలెంజ్ ని తీసుకొని దర్శకుడు రూపిందించిన సినిమా. ధనుష్ చక్కగా చేసి చూపాడు. ఈ సినిమా తమిళ వెర్షన్ వాతి (Vaathi) కూడా అదే టైం కి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం విడుదల అవుతోంది.
సినిమా: రైటర్ పద్మభూషణ్ (జీ5)
జాతీయ అవార్డు అందుకున్న సినిమా కలర్ ఫోటో (Colour Photo) తో పేరు సంపాదించిన నటుడు సుహాస్ (Actor Suhas), మరో సినిమా 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించాడు. థియేటర్ లో మంచి ప్రసంశలు పొందిన ఈ సినిమా రేపు శుక్రవారం విడుదల అవుతోంది. పద్మభూషణ్ అనే యువ రచయిత, పెద్ద రచయితగా పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఏమి చేసాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమా జీ5 (Zee5) లో శుక్రవారం విడుదల అవుతోంది. షణ్ముఖ ప్రశాంత్ (Shanmukha Prashanth) దీనికి దర్శకుడు.
సినిమా: కుత్తే (Kuttey) (నెట్ ఫ్లిక్స్)
ఈ సినిమా గురువారం విడుదల అయింది. అర్జున్ కపూర్ (Arjun Kapoor), టబ్బు (Tabu), నసీరుద్దీన్ షా (Naseeruddin Shah), కొంకణ సేన్ (Konkana Sen), రాధికా మదన్ (Radhika Madan) తదితరులు నటించారు ఇందులో. ఆస్మాన్ భరద్వాజ్ దీనికి దర్శకుడు. ఈ సినిమా కథ మూడు గ్యాంగ్ సభ్యులు కోట్ల రూపాయలను దొంగిలించడానికి అందరూ ఒకటే వెహికల్ వాడతారు.
వెబ్ సిరీస్: పాప్ కౌన్? (Pop Kaun?) (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
దీనికి దర్శకుడు ఫర్హాద్ సమ్ జి (Farhad Samji). ఇదొక కామెడీ డ్రామా. ఇందులో కునాల్ ఖేము (Khunal Khemu), సౌరబ్ శుక్ల (Saurabh Shukla), జానీ లీవర్ (Johny Lever), రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ లాంటి నటులు వున్నారు. సాహిల్ (కునాల్ ఖేము), ఒక పొలిటిషన్ కొడుకు. అయితే అతను ఆ పొలిటిషన్ కొడుకు కాదని, దత్తత తీసుకున్నారని తెలుసుకున్నాక ఒక రకమైన ఇబ్బందిలో పడతాడు. అప్పుడు అతను తాను ఎవరికీ పుట్టాడో, తన అసలు తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకునేందుకు వెళతాడు. ఇలా కనుక్కోవడానికి వెళ్లే త్రోవలో ఎదురయినా సవాళ్ళను కామెడీగా చూపించారు.
ఈ పాప్ కౌన్ సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో రేపు విడుదల అవుతోంది.
వెబ్ సిరీస్: రాకెట్ బాయ్స్ సీజన్ 2 (Rocket Boys) (సోనీ లివ్) (Sony Liv)
రాకెట్ బాయ్స్ రెండో సీజన్ (Rocket Boys second season) గురువారం నుండి సోనీ లివ్ (Sony Liv) లో ప్రారంభం అయింది. ఇది భారత శాస్త్రవేత్తలు, భారత దేశాన్ని న్యూక్లియర్ దేశంగా ఎలా చేశారు, వాళ్ళు చేసిన కృషి, పట్టుదల వలన అది ఎలా సాధ్యం అయింది అనే నేపధ్యం లో సాగే వెబ్ సిరీస్. జిమ్ సరబ్ (Jim Sarab), సబ ఆజాద్ ఇందులో ముఖ్య పాత్రలు చేశారు.