OTT: ఓటీటీలోకి వచ్చిన.. హాలీవుడ్ థ్రిల్లర్,యాక్షన్ డబ్బింగ్ సినిమాలివే
ABN, First Publish Date - 2023-11-24T21:37:02+05:30
చాలామందికి డబ్బింగ్ సినిమాలంటే పిచ్చి ఉంటుంది. మరి ముఖ్యంగా హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.
చాలామందికి డబ్బింగ్ సినిమాలంటే పిచ్చి ఉంటుంది. మరి ముఖ్యంగా హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతివారం ఒక సినిమా వస్తే బాగుండు అనుకునే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయో, ఎలాంటివి వస్తున్నాయో, ఎందులో అవి వస్తున్నాయనే సమాచారం లభించడం కష్టం అలాంటి వారి కోసమే ఈ సమాచారం. సో ఇక కింద ఉన్న వాటిలో మీకు నచ్చే, మీరు మెచ్చే జానర్ లో సినిమా ఉందేమో సెలక్ట్ చేసుకుని చూసేయండి ఆలస్యమెందుకు.
Liam Neeson In Retribution 2023: లియామ్ నిసన్ నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రెట్రీబూషన్ లయన్స్ గేట్ లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నది.
I Saw The Devil (2010): ఐ సా ది డెవిల్ అనే కొరియన్ యాక్షన్ డ్రామా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నది.
The Black Out (2019): ది బ్లాకౌట్ అనే రష్యన్, సెన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.
TrueDetective (2014 To 2019): ట్రూ డిటెక్టివ్ అనే మిస్టరీ, థ్రిల్లర్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ జరుగుతున్నది.
UFO Swedon (2022): యూఏఫ్ వో స్వీడన్ అనే స్వీడిష్ అడ్వెంచర్,సైన్స ఫిక్షన్ సినిమా బుక్ మై షో స్ట్రీమ్ లో రెంట్ పద్దతిలో తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్, స్వీడిష్ భాషల్లో స్ట్రీమ్ అవుతున్నది,
Smugglers (2023): స్మగ్లర్స్ అనే కొరియన్ హైస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.