Kerala Story on OTT: వివాదాస్పద సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది, ఎప్పుడు, ఎక్కడ...
ABN, First Publish Date - 2023-06-19T17:06:12+05:30
కాంట్రవర్సీ సినిమా 'ది కేరళ స్టోరీ' ఓటిటి లో వచ్చేస్తోంది. ఈ సినిమా మీద చాలా వివద్దలు చెలరేగాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాని నిషేధిస్తే, కొన్ని ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు ఓటిటి లో చూసుకోవచ్చు
తెలుగు చిత్రాలలో నటించి ఇటు దక్షిణాదిలో, అటు హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్న నటి ఆదా శర్మ (AdahSharma) ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'ది కేరళ స్టోరీ' (TheKeralaStory). ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుంచి వివాదాల్లోనే వుంది. కొంతమంది ఈ సినిమాని నిషేదించాలని కోర్టుకు కూడా వెళ్లారు, కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత సినిమాను ఆపటం సాధ్యం కాదని చెప్పినట్టు గా సమాచారం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాని ప్రభుత్వాలు నిషేధం విధించారు కూడా.
కేరళ రాష్ట్రంలో ఒక వివాదాస్పదమైన లవ్ జిహాద్ అనే కథను ఎంచుకొని ఆ నేపథ్యంలో దర్శకుడు సుదీప్తో సేన్ (SudiptoSen) ఈ సినిమాను రూపొందించారు. ఒక రాజకీయ పార్టీ ఈ సినిమాకి అండగా మాట్లాడితే, మరికొన్ని పార్టీలు ఈ సినిమాని వ్యతిరేకించాయి. మొత్తం మీద సినిమా విడుదల అయ్యాక కలెక్షన్ల ప్రభంజనం కురిసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ సినిమా మీద నిషేధం విధించారు. ఆసక్తికరం ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా కి పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు.
తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయింది. విడుదల అయిన ప్రతి థియేటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఉంచి ఈ సినిమాని స్క్రీన్ చేశారు. ఈ సినిమా కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తీసినది మొదట చెప్పారు, కానీ సినిమాలో చాలా ఎక్కువ చేసి చూపించారు అని ఒక వర్గం వారు ఆరోపించారు. ఏమైనా కూడా ఈ సినిమాకి రాజకీయ రంగును కూడా పులిమారు. మే 5న విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అయితే థియేటర్ లో ఈ సినిమాని చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి దగ్గర చూడొచ్చు. ఎందుకంటే త్వరలో ఈ సినిమా ఓటిటి లో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ జీ5 'ది కేరళ స్టోరీ' ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. జూన్ 23 నుంచి ఈ సినిమా ఆ ఛానల్ లో స్ట్రీమింగ్ చేస్తారు. ఇది ఒరిజినల్ మలయాళం భాషలోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని చూడొచ్చు.