కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Month of Madhu on OTT: కలర్స్ స్వాతి, నవీన్ చంద్రల సినిమా ఓటిటిలో ...

ABN, First Publish Date - 2023-10-31T12:42:03+05:30

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన 'మంత్ అఫ్ మధు' సినిమా ఓటిటి లో ప్రసారం కానుంది. ఈ సినిమా ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది అంటే...

Month Of Madhu is soon streaming on OTT

టీవీ హోస్ట్, నటి, కలర్స్ స్వాతి (ColorsSwathi), నవీన్ చంద్ర (NaveenChandra) నటించిన 'మంత్ అఫ్ మధు' #MonthOfMadhu సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. ఇక ఈ సినిమాని మీ ఇంట్లో టీవీ లో చూసుకోవచ్చు. నవీన్ చంద్ర ఇందులో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనపడతాడు, ఒకటి ప్రేమికుడిగా, ఇంకొకటి విసిగిపోయి తాగుడుకు అలవాటు పడిన భర్తగా. అలాగే ఒక ఎన్ఆర్ఐ తెలుగు అమ్మాయి శ్రేయా నవేలి (SreyaNaveli) ఇంకో ముఖ్య పాత్రలో కనపడుతుంది.

శ్రీకాంత్ నాగోతి (SrikanthNagothi) దర్శకత్వం వహించిన ఈ 'మంత్ అఫ్ మధు' సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమా వ్యాపారాత్మకంగా అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి తగినంత ప్రచారాలు లేకపోవటం, అదీ కాకుండా సినిమా చాలా నెమ్మదిగా ఉండటం ముఖ్య కారణాలు అని అంటున్నారు. అయితే ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది.

ఈ సినిమా విడుదలైన తరువాత ఇందులో ప్రధాన పాత్ర పోషించిన స్వాతి, కొంతమంది విమర్శకులపై విరుచుకు పడిన సంగతి తెలిసిందే. సినిమా చూసి అలోచించి రాయాలని, అర్థం కావాలంటే దీనికి కొంత చదువు కూడా అవసరం అని చాలా వెటకారంగా మాట్లాడిన స్వాతి కామెంట్స్ తరువాత వైరల్ అయ్యాయి కూడా. కానీ సినిమా చూసే ప్రేక్షకులు ఎవరైనా సినిమా బాగుంటేనే కదా వస్తారు, లేదంటే రారు, అందుకని ఒకరిని తప్పు పెట్టాల్సిన పని లేదు అని కొందరు అన్నారు.

అటువంటి ఈ 'మంత్ ఆఫ్ మధు' సినిమా ఓటీటీలో వస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన నెలలోపే ఓటిటి లో రావటం ఆశ్చర్యమే. ఈ సినిమా ఆహా #Aha ఓటిటి ఛానల్ లో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. అంతకు ముందు ఇదే టీము స్వాతి, నవీన్ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్ నాగోతి కాంబినేషన్లో వచ్చిన ' భానుమతి & రామకృష్ణ' #BhanumathiRamakrishna ఓటిటి లో మంచి విజయం సాధించిందని చెప్పారు. అయితే మరి ఈ సినిమాని ఓటిటి లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.

Updated Date - 2023-10-31T12:42:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!