Bhagavanth Kesari: ఓటీటీలోకి బాలయ్య భగవంత్ కేసరి.. వీక్షకులకు పండగే
ABN, First Publish Date - 2023-11-09T18:07:28+05:30
ఇది నిజంగా సినీ అభిమానులకు అదిరిపోయే వార్తే.. థియేటర్లకు వెళ్లి చూడలేక పోయిన చాలా మంది కుటుంబ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనైతే రాలేదు.
ఇది నిజంగా సినీ అభిమానులకు అదిరిపోయే వార్తే.. థియేటర్లకు వెళ్లి చూడలేక పోయిన చాలా మంది కుటుంబ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ (Bala krishna) హీరోగా శ్రీలీల(Sree leela), కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలియజేప్పే అద్భుతమైన మెసేజ్, అమ్మాయిలను పులిలా పెంచాలనే కాన్సెప్ట్ వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే మంచి మౌత్ టాక్ తెచ్చుకుని హిట్ బాట పట్టింది.
అయితే దసరా కానుకగా థియేటరల్లోకి వచ్చిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari).. టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి భారీ సినిమాలతో పోటీ పడి మరీ 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేగాక వరుసగా మూడో చిత్రంతోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలకృష్ణ హ్యట్రిక్ విజయం సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఆక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా విడుదలై నేటికి 4 వారాలు దాటినా థియేటర్లలో స్టడీగా కలెక్షన్లు రాబడుతూ దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మేకర్స్ తో ముందస్తుగా చేసుకునే ఒప్పందం ప్రకారం సినిమాను 50 రోజుల తర్వాతే తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలకు ముందే అన్లైన్లో హెచ్డీ వెర్షన్లలో లీకవుతుండడంతో సదరు ఓటీటీ సంస్థలు జాగ్రత్త పడుతూ తమ సినిమాలను గడువుకు ముందే తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ‘లియో’ సినిమా హెచ్డీలో నెట్టింట వైరల్ అవుతుండడంతో సినిమాను మరో పది రోజుల్లో ఓటీటీలోకి తెస్తున్నారు.
అయితే ‘భగవంత్ కేసరి’ సినిమా డిసెంబర్ రెండో వారంలో ఓటీటీలోకి రావాల్సి ఉండగా నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video)లో స్ట్రీమింగ్ కు సిద్ధం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించ లేదు, అధికారికంగా ప్రకటించ లేదు. అదేవిధంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ నవంబర్ 24, ‘లియో’ సినిమాలు నవంబర్ 17న స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.