ATM: టెన్షన్ పెడుతూనే నవ్విస్తుందట..
ABN, First Publish Date - 2023-01-19T22:18:17+05:30
టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైరక్టర్ హరీష్‌శంకర్ (Harish Shankar), ఓటీటీ సంస్థ జీ5 (Zee 5), టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) కాంబినేషన్‌లో రాబోతోన్న
టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైరక్టర్ హరీష్‌శంకర్ (Harish Shankar), ఓటీటీ సంస్థ జీ5 (Zee 5), టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) కాంబినేషన్‌లో రాబోతోన్న వెబ్ సిరీస్ ‘ATM’. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ, దివి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. జనవరి 20న ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ అవుతుంది. ఈ సందర్బంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బావుంటుందని ఆలోచన వచ్చింది. అప్పుడు జీ 5 టీమ్‌తో కలిశాను. ఈ కథను నేను రాశాను. కానీ.. డైరెక్టర్‌గా నాకంటే చంద్ర మోహన్ బాగా తీశాడనిపించింది. అంత బాగా తీశాడు. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో సినిమా చూశాను. చంద్రలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. తను సుబ్బరాజుగారికి క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు చాలా బావుంది. రెండున్నర గంటల కంటెంట్‌ను తీయటానికి మాకు వంద రోజులు పడుతుంది. అలాంటిది నాలుగున్నర గంటల కంటెంట్‌ను తీయటానికి 50 రోజులే తీసుకున్నారంటే చాలా గ్రేట్. ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. హర్షిత్, హన్షితలకు థాంక్స్. సుబ్బరాజ్, సన్ని, దివిలకు థాంక్స్. కంటెంట్‌ను ప్యూర్‌గా చెప్పొచ్చు అనే ప్యాషన్‌తో ఓటీటీల్లోకి వచ్చాం. దానికి సపోర్ట్ చేసిన జీ5కి థాంక్స్. సినిమా అనేది శాశ్వతం’’ అన్నారు. (ATM Pre Release Event)
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘జీ 5కి కంగ్రాట్యులేషన్స్. మాతో ఓ వెబ్ సిరీస్ చేయించారు. 25 ఏళ్లు డిస్ట్రిబ్యూటర్‌గా, 20 ఏళ్లు నిర్మాతగా ఉన్నాను. హరీష్ శంకర్ వెబ్ సిరీస్ చేద్దామని నాతో చెప్పిప్పుడు ఇప్పుడు వెబ్ సిరీస్‌లేంటి అన్నాను. కానీ ముందు తను కథ వినమంటే విన్నాను.. నచ్చింది. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హర్షిత్, అమ్మాయి హన్షితలను నిర్మాతలుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైలర్ చూడగానే సినిమా ట్రైలర్‌గానే అనిపించింది. చంద్ర మోహన్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు నచ్చింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ ద్వారా న్యూ టాలెంట్‌ను తీసుకు రావాలనేదే మా లక్ష్యం. టెన్షన్ పడుతూనే సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు. జనవరి 20న ఈ సిరీస్ ఆడియెన్స్ ముందుకు రానుంది’’ అన్నారు.
దర్శకుడు క్రిష్ (Krish) జాగర్లమూడి మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) అనే బ్యానర్‌పై సినిమాలు చేస్తున్న హర్షిత్, హన్షితలకు అభినందనలు. కొత్త మాధ్యమంలోకి అడుగు పెట్టారు. హరీష్ ఈ సిరీస్‌కు కథను అందించటంతో పాటు షో రన్నర్‌గానూ వర్క్ చేశారు. బిగ్ స్క్రీన్‌పై చెప్పలేకపోతున్న కథలను ఓటీటీల్లో చెప్పటానికి ప్రయత్నిస్తున్న హరీష్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. డైరెక్టర్ చంద్ర మోహన్ సిరీస్‌ను చక్కగా తీశారు.. ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మా అంతరిక్షం సినిమాలో వర్క్ చేశాడు. మంచి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఇలాంటి కొత్త కంటెంట్‌తో మరిన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఓటీటీల్లోకి రావాలి’’ అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.