సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Butta Bomma: ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!

ABN, First Publish Date - 2023-02-28T19:57:14+05:30

భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఈ నిర్మాణ సంస్థే నుంచి వచ్చింది. అదే బాటలో పయనిస్తూ ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రాజెక్టు ‘బుట్టబొమ్మ’ (Butta Bomma).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఈ నిర్మాణ సంస్థే నుంచి వచ్చింది. అదే బాటలో పయనిస్తూ ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రాజెక్టు ‘బుట్టబొమ్మ’ (Butta Bomma). మలయాళం హిట్ ‘కప్పేల’ (Kappela) కు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో అనికా సురేంద్రన్‌ (Anikha Surendran), సూర్య వశిష్ఠ (Surya Vashistta), అర్జున్‌ దాస్‌ (Arjun Das) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది.

‘బుట్టబొమ్మ’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మార్చి 4నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. అయితే, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయినప్పటికీ ఓటీటీలో రికార్డులను మాత్రం తిరగరాస్తున్నాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ ఓటీటీలో రికార్డు స్థాయి వీక్షణలను సాధించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మరి, ‘బుట్టబొమ్మ’ అటువంటి రికార్డులను సృష్టిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. చిత్ర కథ విషయానికి వస్తే.. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి సత్య (అనికా సురేంద్రన్‌). ఆమె చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఓ డబ్బున్న కుర్రాడు తపన పడుతుంటారు. కానీ, ఓ రాంగ్‌ నంబర్‌ సత్య జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం ఒక్కసారైనా చూడకుండానే ఫోన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఓకే చేయడంతో ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. కానీ, ఆ తర్వాత ఆమె జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-28T20:25:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!