సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

ABN, First Publish Date - 2023-05-10T15:57:27+05:30

థియేటర్లో ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అందులోనూ ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాదు.. రెండింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్

CSI Sanatan Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్‌ (Aadi Saikumar) వరుస సినిమాలతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి.. ఇలా బిజీగా ఉంటున్న ఆది సాయి కుమార్.. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘CSI సనాతన్‌’ (CSI Sanatan) అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అందులోనూ ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాదు.. రెండింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

భవానీ మీడియా సంస్థ ద్వారా తాజాగా ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video), ఆహా (Aha) వంటి ఓటీటీ యాప్‌లలో విడుదలైంది. ఆది క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్‌ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో మంచి ఆదరణను రాబట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆది సాయికుమార్ సినిమాలు ఈ మధ్య కాలంలో థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఓటీటీలో మంచి విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఆదికి జోడీగా మిషా నారంగ్‌ (Misha Narang) హీరోయిన్‌గా నటించగా.. నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) అనే పేరు మోసిన ఫైనాన్స్ కంపెనీ సీఈఓ అనుమానాస్పదంగా హత్య చేయబడతాడు. ఈ కేసు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్(సిఎస్ఐ)లో వర్క్ చేస్తున్న స్పెషలిస్ట్ సనాతన్ (ఆది సాయి కుమార్) దగ్గరకి వెళ్తుంది. అతను ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు? ఈ ఇన్వెస్టిగేషన్‌లో హీరోయిన్ పాత్ర ఏంటి? ఇంతకీ ఆ విక్రమ్ చక్రవర్తి ఎవరు? అతనిని ఎవరు చంపారు? అనే ఆసక్తికర కథాంశంలో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ (Ajay Srinivas) నిర్మించగా.. శివశంకర్‌ దేవ్‌ (Siva Shankar Dev) దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

Updated Date - 2023-05-10T15:57:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!