సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MosagallakuMosagadu: 50 దేశాల్లో ఇంగ్లీష్ లో విడుదల అయిన మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం

ABN, First Publish Date - 2023-05-23T11:14:00+05:30

సూపర్ స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన ఇండియాలో మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'. ఈ సినిమాని రాజస్థాన్ లో షూట్ చేశారు, హైదరాబాద్ నుండి ఒక ట్రైన్లో మొత్తం యూనిట్ సభ్యులు, పరికరాలతో వెళ్లి షూట్ చేశారు. ఇది మొదటి పాన్ ఇండియా సినిమానే కాకుండా, మొదటి పాన్ వరల్డ్ సినిమా కూడా. ఈ నెల 31 న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అనే పదం పట్టుకొని తమ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నామని అనుకుంటూ వుంటారు. కానీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లోనే మన తెలుగు సినిమా విడుదల అయిందని ఎంతమందికి తెలుసు. అది ఇప్పుడు కాదు, 52 సంవత్సరాల క్రితమే ఈ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల అయిన తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ (SuperstarKrishna), విజయ నిర్మల (Vijayanirmala) నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' #MosagallakuMosagadu.

ఈ సినిమా తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో అప్పట్లో రాజస్థాన్ వెళ్లి మరీ షూటింగ్ చేసి ఇండియాలోనే మొదటి కౌబాయ్ #India'sFirstCowboyFilm సినిమాగా తెరకెక్కించాడు. దీనికి కె.ఎస్.ఆర్. దాస్ (KSRDas) దర్శకుడు. కృష్ణ గారు ఇందులో నటించడమే కాకుండా, ఈ సినిమాకి నిర్మాత కూడాను. కృష గారు తమ్ముళ్లు హనుమంత రావు, ఆదిశేషగిరి రావులు (GAdiseshagiriRao) ఈ సినిమా నిర్మాణంలో కృష్ణగారితో పాటు ఎంతో కృషి చేసినవాళ్లు.

ఈ సినిమాని ఇంగ్లీష్ లోకి 'ట్రెజర్' (TheTreasure) అనే పేరు మీద విడుదల చేశారు. వాళ్ళకి పాటలు అనవసరం అని తీసేసారు. అలాగే హిందీ, తమిళం భాషల్లోకి కూడా తర్జుమా చేసి విడుదల చేశారు. హిందీలో దీనికి 'ఖజానా' (Khajana) అని పేరు పెట్టారు. అంటే అప్పట్లోనే ఒక తెలుగు సినిమా ఇంతలా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తీశారు అంటే నిజంగా కృష్ణ గారు కాబట్టే చేయగలిగారు. అందుకే అయన సాహసానికి మరో పేరు అంటారు. డేరింగ్ అండ్ డేషింగ్ #Daring&DashingHeroKrishna హీరో కృష్ణ అని ఆయనొక్కడినే అంటారు, అయన అంతటి ఘనుడే కూడా.

ఈనెల 31వ (May31) తేదీన కృష్ణ గారి పుట్టినరోజు (SSKBirthday) సందర్భంగా ఈ సినిమాని 4కె లోకి మార్చి మళ్ళీ విడుదల చేస్తున్నారు. నిన్న కృష్ణ గారి కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా రి-రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది మొట్టమొదటి కౌబాయ్ సినిమా. కృష్ణ, విజయనిర్మల (Vijayanirmala), జ్యోతిలక్ష్మి, నాగభూషణం (Nagabhushanam), ధూళిపాళ, సత్యనారాయణ (KaikalaSatyanarayana), ముక్కామల, రావు గోపాల రావు (RaoGopalaRao) మున్నగువారు వున్నారు.

Updated Date - 2023-05-23T11:14:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!