సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pic Talk: సమ్మోహన అభినయం అంటే ఇది..

ABN, First Publish Date - 2023-04-02T15:20:14+05:30

ఎన్‌.టి.ఆర్‌. (NT Ramarao) రాకుమారుడిగా వీరోచితంగా నటించారు. కన్నతండ్రే రేచుక్క (ఎస్‌.వి.రంగారావు), తనను పెంచిపెద్ద చేసిన దాదియే (కన్నాంబ) కన్నతల్లి అన్న నిజం తెలిసిన సన్నివేశంలో

NTR And Sowcar Janaki
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయా- ఎన్‌.ఏ.టి.వారు (Vijaya - NTR) ‘స్వస్తిశ్రీ’ సంస్థ పేరిట భాగస్వామ్యంలో తీసిన ‘రేచుక్క - పగటి చుక్క’ (Rechukka Pagatichukka) (14-05-1959) చిత్రం లోనిది ఈ స్టిల్‌. ఈ చిత్రం భారీ తారాగణంతో పెద్దపెద్ద సెట్టింగులతో రూపుదిద్దుకుంది. ఇందులో ఎన్‌.టి.ఆర్‌. (NT Ramarao) రాకుమారుడిగా వీరోచితంగా నటించారు. కన్నతండ్రే రేచుక్క (ఎస్‌.వి.రంగారావు), తనను పెంచిపెద్ద చేసిన దాదియే (కన్నాంబ) కన్నతల్లి అన్న నిజం తెలిసిన సన్నివేశంలో ఎన్‌.టి.రామారావు చాలా ఉదాత్తంగా నటించారు. తన తమ్ముడు ఎన్‌. త్రివిక్రమరావును నిర్మాతను చేయడం కోసమే ఎన్‌.టి.ఆర్‌. ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ సెట్టింగులు, రెహమాన్‌ ఫోటోగ్రఫీ విశేషంగా ఆకర్షించాయి. ఈ సినిమాలో ఎస్‌.వి.రంగారావు (SV Rangarao) నటనకు దీటుగా శౌర్యాన్ని ప్రదర్శించారు ఎన్‌.టి.రామారావు. యువరాణి (షావుకారు జానకి Sowcar Janaki)తో ప్రణయ గీతాలలో రామారావు సున్నిత నటన చాలా బాగుంటుంది. ముఖ్యంగా ‘కాదా? అవునా...’ పాటలో ముఖకవళికల ద్వారా మంచి అభినయాన్ని ప్రదర్శించారు. ఎన్‌.టి.ఆర్‌, ఆర్‌. నాగేశ్వరరావు (R Nageswara Rao)ల ద్వంద్వ యుద్ధం చూడాల్సిందే. ఈ చిత్రం ‘‘రాజ సేవై’’ అనే పేరుతో తమిళంలో కూడా నిర్మించబడింది.

- డా. కంపల్లె రవిచంద్రన్‌,

98487 20478.

ఇవి కూడా చదవండి:

*********************************

*Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?

*Costumes Krishna: దిల్ రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

Updated Date - 2023-04-02T15:21:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!