Pic Story: చివరకు విజయం తప్పదని చెప్పే చిత్రం
ABN, First Publish Date - 2023-04-23T10:13:14+05:30
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘మారిన మనిషి’ (24-09-1970) చిత్రంలోనిది ఈ స్టిల్. చెడుదారిలో నడిచిన మనిషి తన తప్పు తెలుసుకుని మంచిదారిలో నడిచే ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతాయి.
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘మారిన మనిషి’ (Marina manishi)(24-09-1970) చిత్రంలోనిది ఈ స్టిల్. చెడుదారిలో నడిచిన మనిషి తన తప్పు తెలుసుకుని మంచిదారిలో నడిచే ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతాయి. గతం అతనికి భవిష్యత్తు పట్ల నిరాశను, నిస్పృహను కలిగిస్తుంది. కానీ ఆ ఆటంకాలను ఓర్పుతో ఎదుర్కొని సాహసంతో ముందడుగు వేయగలిగే మనిషికి చివరకు విజయం తప్పదని నిరూపించిన చిత్రమిది. (Ntr)
ఇందులో మొదట దొంగగా, తర్వాత మారిపోయిన మనిషిగా ఎన్.టి.రామారావు వైవిధ్యభరితమైన నటన చూపారు. మంచికీ, చెడుకూ జరిగిన సంఘర్షణలో, తన నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం వేదన పొందిన సన్నివేశాలలో ఆయన నటన చాలా గొప్పగా ఉంది. 4
అంతవరకూ మంచివాడనుకుంటున్న తల్లి (హేమలత)కి కొడుకు దొంగ అన్న నిజం తెలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఏ తల్లి కోసం తాను దొంగ అయినాడో, ఆ తల్లే తన ప్రవర్తనకు కుమిలిపోయి, లోకాన్ని వీడిపోయిన సన్నివేశంలో రాజు హృదయం ముక్కలవుతుంది. ఈ సన్నివేశంలో రాజు పాత్రలో ఎన్.టి.ఆర్. శోకరసావిష్కరణ అత్యద్భుతం. ‘దొంగతనం పనికిరాదు అమ్మడూ’ అనే ప్రబోధగీతం, ‘ఏం చేస్తావే బుల్లెమ్మా’ పాటలో ఎన్.టి.ఆర్ అభినయం హుషారుగా ఉంటుంది. ఎన్.టి.ఆర్. సరసన విజయనిర్మల హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రమిది.
- డా. కంపల్లె రవిచంద్రన్, 98487 20478.