NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు
ABN, First Publish Date - 2023-04-09T17:04:09+05:30
తెలుగు సినిమాల్లో కళాఖండంగా నిలిచిపోయిన ‘మహామంత్రి తిమ్మరసు’ (Mahamantri Timmarusu) (26-07-1962) చిత్రంలోనిది ఈ స్టిల్. ఇందులో ఎన్.టి.రామారావు (NT Ramarao) శ్రీకృష్ణదేవరాయలు (SriKrishna Devaraya)గా..
తెలుగు సినిమాల్లో కళాఖండంగా నిలిచిపోయిన ‘మహామంత్రి తిమ్మరసు’ (Mahamantri Timmarusu) (26-07-1962) చిత్రంలోనిది ఈ స్టిల్. ఇందులో ఎన్.టి.రామారావు (NT Ramarao) శ్రీకృష్ణదేవరాయలు (SriKrishna Devaraya)గా నటించారు. ఈ సినిమా నిర్మాణదశలో ఉండగానే కొంతమంది రామారావుతో ‘మీరు రాయల పాత్ర వేస్తున్నప్పుడు, చిత్రానికి మీ పేరు పెట్టకుండా తిమ్మరుసు (గుమ్మడి Gummadi) అని టైటిల్ పెట్టడమేమట’ని ఆయనను రెచ్చగొట్టారు. దానికి ‘‘ఇది రాయలవారి కథ కాదు! తిమ్మరుసు కథ! తిమ్మరుసు ఒక మహావృక్షం అయితే, ఆ వృక్షాన్ని ఆధారంగా చేసుకుని, అల్లుకున్న తీగెవంటి వాడు రాయలు’’ అని చిత్ర నిర్మాతలను సమర్థించిన ఉదారత్వం ఎన్.టి.ఆర్. (NTR About Mahamantri Timmarusu) ది. రాయలవారి పాత్రను ధరించడమనేది అంతకుముందు ‘తెనాలి రామకృష్ణ’ (Tenali Ramakrishna) చిత్రంలోనే జరిగినా, నటనకు ‘తిమ్మరుసు’ (Timmarusu) చిత్రంలో ఉన్నంత అవకాశం ఆ చిత్రంలో లేదు.
‘మహామంత్రి తిమ్మరుసు’ (Mahamantri Timmarusu Movie) రాష్ట్రపతి రజతపతకాన్ని పొందింది. పుస్తకంలో మన చరిత్రను గురించి చదవడం వేరు! వెండితెర మీద ఆ చరిత్రను దృశ్యరూపంలో దర్శించడం వేరు. అలా వందల ఏళ్లనాటి చరిత్రకు సెల్యులాయిడ్ రూపం ఈ చిత్రం. ఈ చిత్రం నిర్మించిన గౌతమిసంస్థ (Gowtami Productions) కాలగర్భంలో కలిసి పోయినా ‘మహామంత్రి తిమ్మరుసు’ మాత్రం నేటికీ అజరామరంగా నిలిచిపోయింది. కమలాకర కామేశ్వరరావు (Kamalakara Kameswara Rao) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పింగళి నాగేంద్రరావు (Pingali Nagendra Rao) కథను సమకూర్చారు.
- డా. కంపల్లె రవిచంద్రన్
98487 20478
ఇవి కూడా చదవండి:
*********************************
*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు
*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్
*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..
*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?
*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?