Manchi Manishi Pic Story: అంతగా నను చూడకు..
ABN, First Publish Date - 2023-04-30T12:02:28+05:30
ఎన్.టి.రామారావు, జమున కలిసి నటించిన ‘మంచిమనిషి’ (11.11.64) చిత్రంలోనిది ఈ స్టిల్. మంచిచెడ్డలు జన్మతః రావనే ప్రబోధాత్మకమైన కథ.
ఎన్.టి.రామారావు(N.T.Ramarao), జమున (jamuna)కలిసి నటించిన ‘మంచిమనిషి’ (Manchi manishi)(11.11.64) చిత్రంలోనిది ఈ స్టిల్. మంచిచెడ్డలు జన్మతః రావనే ప్రబోధాత్మకమైన కథ. గొప్ప ఆదర్శాలను గొప్పగా చెప్పడం కాక, అవి అందరికీ అందుబాటులో ఉండే శైలిలో అందించడంలో నేర్పరైన కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన విలక్షణ చిత్రమిది. ఇందులో వేణుగా ఎన్.టి.ఆర్. చూడముచ్చటగా నటించారు. దొంగగా, ప్రేమికునిగా, దగాపడ్డ వ్యక్తిగా ఆయన చక్కటి హావభావాలను వ్యక్తం చేశారు. చాలా సంక్లిష్టమైన పాత్రను అతి సునాయాసంగా నటించి చూపారు. (oldies)
సాలూరి రాజేశ్వరరావు, టి. చలపతి రావుల జమిలి సంగీతంలో పాటలన్నీ ఘనవిజయం సాధించాయి. ఎన్.టి.ఆర్., జమునపై చిత్రీకరించిన ‘అంతగా నను చూడకు..’, ‘రాననుకున్నావేమో ..’ యుగళగీతాలలో జమున నునుసిగ్గు, ఎన్.టి.ఆర్. కొంటెతనం రసికప్రేక్షకులను రంజింపచేశాయి. జగ్గయ్య ముఖతః వినిపించిన ‘ఓహో గులాబి బాలా’ పాటలో కూడా ఎన్.టి.ఆర్. నటనే హైలైట్ అయింది. ‘‘చూపుల గాలం వేస్తారు..’’ అనే చరణంలో ఎన్.టి.ఆర్. చూపులు మరల్చడం .. ఆయన టైమింగ్ ప్రతిభకు మెచ్చుతునక. (Pic story)
- కంపల్లె రవిచంద్రన్
98487 20478