SuperStar Krishna: కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్లుగా నటించిన సినిమా ఏదో తెలుసా...
ABN, First Publish Date - 2023-04-04T12:31:47+05:30
కృష్ణ విజయనిర్మల భార్య భర్తలుగా అందరికి తెలుసు. అలాగే వాళ్లిద్దరూ కూడా చాల సినిమాల్లో లీడ్ పెయిర్ గా నటించారు, కానీ పెళ్లయ్యాక వాళ్లిద్దరూ అన్న చెల్లెలుగా కూడా నటించారని తెలుసా...
సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna), విజయ నిర్మల (Vijayanirmala) భార్య భర్తలు గానీ అందరికీ తెలుసు. అలాగే వాళ్లిద్దరూ కలిపి ఎన్నో సినిమాలు చేసారు కూడా. అయితే వాళ్లిద్దరూ అన్న చెల్లెలుగా (Brother and sister) నటించిన సినిమాలు కూడా వున్నాయని చాలా కొద్దిమందికే తెలుసు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటి అంటే, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నాక, అలాగే కథానాయకులుగా నటించాక ఇలా అన్న చెల్లెలుగా నటించారు. అదీ విచిత్రం.
మూవీ మొఘుల్ దగ్గుబాటి రామానాయుడు (D Ramanaidu) నిర్మాతగా తొలినాళ్లలో కొన్ని సాంఘీక, పౌరాణిక, జానపద సినిమాలు తీశారు. అతను మొట్టమొదటి సినిమా 'రాముడు భీముడు' (Ramudu Bheemudu) ఎన్టీఆర్ తో. ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనపడతాడు. ఈ సినిమా కన్నా ముందు 'అనురాగం' (Anuragam) అని ఒక సినిమా తీశారు రామానాయుడు, కానీ అది అంతగా ఆడలేదు. అప్పుడు ఎన్టీఆర్ (NTR) తో 'రాముడు భీముడు' తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రామానాయుడు కి ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడింది, అందుకే ఇదే మొదటి సినిమా అని చెప్తారు.
ఆ తరువాత జానపద చిత్రం, ‘ప్రతిజ్ఞాపాలన’ (1965), పౌరాణిక చిత్రం ‘శ్రీకృష్ణ తులాభారం’ (SriKrishna Tulabharam) (1966) నిర్మించారు. అలాగే 'స్త్రీ జన్మ’ (1967) అనే సినిమా కూడా రామానాయుడు రూపొందించారు. ఆ తరువాత ‘సురేష్ మూవీస్’ పేరిట ‘పాపకోసం’ (1968). బొమ్మలు చెప్పిన కథ (Bommalu Cheppina Katha) (1969), సిపాయి చిన్నయ్య (1969), ద్రోహి (1970) చిత్రాలు నిర్మించారు.
ఇలా నిర్మించిన వాటిలో 'బొమ్మలు చెప్పిన కథ' ఈరోజు అంటే ఏప్రిల్ 4, 1969 లో విడుదల అయింది. ఇది కూడా ఒక రకంగా జానపద చిత్రమే అని చెప్పవచ్చు. దీనికి జి. విశ్వనాథం దర్శకుడు కాగా ఇందులో చాలా పెద్ద స్టార్ కాస్ట్ వుంది. కృష్ణ (Krishna), కాంతారావు (Kantha Rao), ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy), ధూళిపాళ, శివరాం, రాజబాబు, సత్యనారాయణ (Kaikala Satyanarayana), మిక్కిలినేని, విజయనిర్మల (Vijayanirmala), విజయలలిత (Vijayalalitha), గీతాంజలి, హేమలత లాంటి నటులు పని చేశారు.
ఇదే సినిమాలో కృష్ణ, విజయనిర్మల అన్న చెల్లెలుగా నటిస్తారు. విజయనిర్మల ఇందులో కాంతారావు పక్కన నటిస్తే, కృష్ణ పక్కన గీతాంజలి వేసింది. ఈ సినిమా తో పాటు కృష్ణ విజయ నిర్మల అన్న చెల్లెలు గా నటించిన చిత్రాలు ఇంకో రెండు వున్నాయి. అవి
మంచి మిత్రులు’ ‘ముహూర్తబలం’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు. ఆ తరువాత వారిద్దరూ మరెప్పుడూ అన్న చెల్లెలుగా నటించలేదు.
'బొమ్మలు చెప్పిన కథ' ఈరోజు ఏప్రిల్ 4 వ తేదీకి 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1969, ఏప్రిల్ 4 న విడుదల అయిన ఈ సినిమా మరీ అంత ప్లాప్ కాదు, ఆలా అని పెద్ద హిట్ కూడా కాదు.
ఇవి కూడా చదవండి
Dasara: తెలుగులో ఫుల్, మిగతా భాషల్లో డల్
RanaNaidu: దానివల్ల వెంకీ మామకి ఏమయిందో తెలిస్తే షాక్ అవుతారు