Kanchu Kagada: ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!
ABN, First Publish Date - 2023-04-16T19:30:02+05:30
ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR)కు వ్యతిరేకంగా హీరో కృష్ణ (Hero Krishna) ఊటీ నుంచి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో
తన అభిమాన నటుడు హీరో కృష్ణ (Krishna) తో ఓ భారీ సినిమా తీయాలనీ, పరిశ్రమలో అంతవరకూ లేని బడ్జెట్‌తో ఆ చిత్రం తయారు కావాలనే కోరికతో నిర్మాత రామలింగేశ్వరరావు (Producer Ramalingeswara Rao) ‘కంచుకాగడా’ (Kanchu Kagada) తీశారు. ఎన్నాళ్లనుంచో తన మదిలో ఉన్న ఊహలకు ఓ రూపం ఇచ్చి ఈ చిత్రకథ రాయించారాయన. ‘నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే ఆయనతో ఈ చిత్రం తీయించింది. ‘కలర్‌ఫుల్ కాస్ట్లీ ఫిల్మ్’గా ఆ రోజుల్లో ‘కంచుకాగడా’ పేరొందింది. భారీ తారాగణం, భారీ సెట్స్, భారీ సాంకేతిక విలువలు.. ఒకటనేమిటి సినిమాలో అడుగడుగునా భారీతనమే కనిపిస్తుంది. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు రామలింగేశ్వరరావు. ఈ చిత్రానికి ముగ్గురు రచయితలు.. సత్యమూర్తి, మహారథి, సత్యానంద్ పనిచేశారు.
ఈ చిత్రానికి స్ర్కీన్‌పరంగా కూడా దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి (A Kodandarami Reddy) ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హీరోయిన్‌గా శ్రీదేవిని ఎంపిక చేశారు. గ్లామర్ క్వీన్‌గా వెలుగొందుతున్న ఆమెకు చాలా కాలం తర్వాత తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రావడంతో ఈ చిత్రంలోని దుర్గ పాత్రను ఓ ఛాలెంజ్‌గా తీసుకొని నటించారు. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్‌లో పాల్గొని అందర్నీ ఆశ్యర్యపరిచారు శ్రీదేవి (Sridevi). ఒక పక్క ‘కంచుకాగడా’ షూటింగ్ జరుగుతుంటే మరో పక్క కృష్ణ (Krishna), శోభన్‌బాబు (Sobhan Babu) నటించే మల్టీస్టారర్ ‘మహాసంగ్రామం’ (Maha Sangramam) కూడా నిర్మాణంలో ఉండేది. రెండూ భారీ చిత్రాలే. దాంతో ఒకదాన్ని మించి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు, తిరుపతిరెడ్డి ఖర్చు విషయంలో పోటీ పడేవారు. ఈ రెండు చిత్రాలకూ కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం గమనార్హం.
భారీ ఓపెనింగ్స్
‘కంచుకాగడా’ కంటే ముందు నిర్మాత డూండీ నిర్మించిన ‘దొంగలు బాబోయ్ దొంగలు’ (Dongalu Baboi Dongalu) చిత్రం విడుదల కావాలి. అయితే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR)కు వ్యతిరేకంగా హీరో కృష్ణ (Hero Krishna) ఊటీ నుంచి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికి కృష్ణ చిత్రాలు ఆడనివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఇంత గొడవ జరుగుతుంటే తన సినిమా విడుదల చేయడానికి డూండీ భయపడ్డారు. అయితే రామలింగేశ్వరరావు ధైర్యంగా ముందుకు వచ్చి ‘కంచుకాగడా’ విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి కొంతమంది ప్రయత్నించినా థియేటర్లకు భారీ సంఖ్యలో వచ్చిన కృష్ణ అభిమానుల్ని చూసి వెనక్కి తగ్గారు. ఈ సినిమా విడుదల సమయంలో విజయవాడలోని థియేటర్ల దగ్గర 144 సెక్షన్‌ను పోలీసులు విధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
*********************************
*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!
*Rakul Preet Singh: రకుల్ రీ ఎంట్రీ సాధ్యమేనా?
*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?
*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?