Shruti Haasan: నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు
ABN, First Publish Date - 2023-01-16T18:58:48+05:30
తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) స్పష్టం చేశారు. తాను మనోవ్యాధితో
తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) స్పష్టం చేశారు. తాను మనోవ్యాధితో బాధపడుతున్నట్టు సాగుతున్న దుష్ప్రచారంపై తాజాగా ఆమె స్పందించారు. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలైన మంచి విజయం సాధించాయి. కలెక్షన్ల పరంగానూ రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాల విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషన్స్‌లో ఆమె ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై, మరో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. సోషల్ మీడియాలో సాగుతున్నట్టుగా మానసిక సమస్యలతో బాధపడటం లేదు. ఇది కూడా మంచి ప్రచారమే’’ అంటూ నెటిజన్లకు ఆమె షాకిచ్చారు. తెలుగులో నందమూరి హీరో నటించిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. కానీ, వైజాగ్‌లో జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ వేడుకకు హాజరుకాలేదు. వైరల్ ఫీవర్ కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు పేర్కొన్నారు. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా అర్థం చేసుకుని, శృతిహాసన్ మనోవ్యాధితో బాధపడుతున్నట్టుగా ప్రచారం చేశారు. ఈ స్క్రీన్ షాట్లను తీసి షేర్ చేసిన ఆమె.. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు స్పష్టం చేశారు.