Ravi Kishan - Nagma: నగ్మాతో వివాహేతర సంబంధం!?.. స్పందించిన ‘రేసుగుర్రం’ విలన్
ABN, First Publish Date - 2023-04-02T15:12:30+05:30
ఒక పరిశ్రమలోని నటులు మరో పరిశ్రమలో నటించడం మామూలే. అయితే.. ఓ సినీ పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతున్న పలువురు హీరోలు సైతం ఇతర భాషల్లో విలన్లు గా నటించారు.
ఒక పరిశ్రమలోని నటులు మరో పరిశ్రమలో నటించడం మామూలే. అయితే.. ఓ సినీ పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతున్న పలువురు హీరోలు సైతం ఇతర భాషల్లో విలన్లు గా నటించారు. అలా కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ తెలుగు సినిమాలో నటించారు. అదే బాటలో నడుస్తూ ప్రముఖ భోజ్‌పురి స్టార్ రవి కిషన్ (Ravi Kishan) సైతం ‘రేసుగుర్రం’ (Racegurram) ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి విలన్‌గా పరిచయమయ్యారు. అనంతరం కూడా పలు సినిమాల్లో విలన్‌గా నటించారు. అంతేకాకుండా.. యూపీలో ఎంపీగా కూడా ఉన్నారు. ఆయనకి అక్కడ రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది. అయితే.. ఈ నటుడికి ఒకప్పటి తమిళ, తెలుగ స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు నగ్మాతో వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ స్పందించారు.
రవికిషన్ మాట్లాడుతూ.. ‘నేను నగ్మా కలిసి చాలా చిత్రాలలో నటించాం. అవి బ్లాక్‌బస్టర్‌లు అయ్యాయి. అందుకే అలాంటి పుకార్లు వ్యాపించాయి. అయితే.. మేం చాలా మంచి స్నేహితులం. కాబట్టి మేము ఎక్కువగా సినిమాలు కలిసి చేసేవాళ్లం. అంతేకాని మరేం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా నాకు పెళ్లి అయిందని ఆమెతోపాటు అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను గౌరవించడంతో పాటు ఆమెకు భయపడుతాను. ఆమె పాదాలు తాకడానికి కూడా వెనుకాడను. ఎందుకంటే.. నా దగ్గర డబ్బు లేనప్పటి నుంచే నా భార్య నాతోనే ఉంది’ అని చెప్పుకొచ్చారు. (Ravi Kishan affair with Nagma)
అనంతరం రవికిషన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు స్టార్‌డమ్ వచ్చిన తర్వాత నాలో అహంకారం చాలా పెరిగింది. అప్పుడే బిగ్‌బాస్‌కి వెళ్లమని నా భార్య సలహా ఇచ్చింది. తను చెప్పినట్లుగానే వెళ్లను. దాదాపు మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడే నాలో చాలా మార్పు వచ్చింది. నాకు పాపులారిటీ రావడంతో పాటు నేను కూడా సాధారణ వ్యక్తిలా మారిపోయాను. అనంతరం నా భార్యాపిల్లలు, నా కుటుంబానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోగలిగాను’ అని తెలిపారు. (Ravi Kishan about Nagma)
అలాగే.. 2009లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్ పుకార్లపై నగ్మా స్పందించింది. నగ్మా మాట్లాడుతూ.. ‘ఎవరైనా తన సహా నటులతో మంచి బంధాన్ని కలిగి ఉంటే ఏమౌతుంది. రీల్ లైఫ్‌లో, మేము భర్త, భార్య లేదా ప్రేమికులను నటిస్తాము. కెమెరా లేనప్పుడు కూడా ఒకరితో మరొకరికి మంచి రిలేషన్ ఉండడంలో తప్పేముంది’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..
IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్
Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..
Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..
Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..