సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..

ABN, First Publish Date - 2023-06-22T21:06:24+05:30

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మేనేజర్‌తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాజాగా రష్మిక, ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.. అంతే తప్ప మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

Rashmika Mandanna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తన మేనేజర్‌తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మేనేజర్‌ (Manager)తో విభేదాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలలో నిజం లేదంటూ రష్మిక మందన్నా, ఆమె మేనేజర్ అధికారికంగా తెలియజేశారు. ఇద్దరూ ఈ విషయంపై ఓ మెసేజ్‌ (Message)ను మీడియాకు విడుదల చేశారు. ఇందులో తను, తన మేనేజర్ విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని రష్మిక తెలిపింది.

‘‘ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్‌గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం’’ అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు. దీంతో విషయం సద్దుమణిగినట్లుగానే అంతా అనుకుంటున్నారు. ఈ ఫీల్డ్‌లో బయటకు వచ్చారంటే.. ఇలాంటి వార్తలే వినిపిస్తాయి. ఎందుకంటే.. ప్రొఫెషనల్‌గా వర్క్ చేసే వాళ్లని అంత సామాన్యంగా ఎవరూ వదులుకోరు. మరి రష్మిక ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఆమెకే తెలియాలి. (Rashmika Mandanna Message)

రష్మిక మేనేజర్‌ విషయంలో అసలు వినిపించిన వార్తలు ఏమిటంటే..

రష్మిక తనకు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్‌లో కొంత తన మేనేజర్ దగ్గర దాచమని ఇచ్చిందట. అయితే ఆ మేనేజర్ ఆమెకి చెప్పకుండా ఆ డబ్బులో కొంత వాడేసుకున్నాడని.. కొన్ని రోజుల తరువాత రష్మిక మళ్ళీ ఆ డబ్బు గురించి అడిగితే, అప్పుడు తను అందులో కొంత వాడుకున్నట్టుగా రష్మికకి చెప్పినట్టుగా టాక్. అతనలా చెప్పడంతో.. రష్మిక చాలా సీరియస్ అయిందట. తనకి చెప్పకుండా మేనేజర్ తన డబ్బుని ఎలా వాడుకుంటాడు అనే పాయింట్ మీదే బాగా సీరియస్ అవడంతో.. ఇద్దరి మధ్య మాట మాట పెరగడం, అందులో మేనేజర్ ఏదో మాట తూలడం జరిగిందని.. దీంతో కోపం వచ్చిన రష్మిక వెంటనే అతన్ని డిస్మిస్ చేసిందనేలా టాక్ బయటికి వచ్చింది. (Rashmika Mandanna and Her Manager Issue)

ఇవి కూడా చదవండి:

**************************************

*MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’


**************************************

*Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు


**************************************

*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?


**************************************

*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు


**************************************

*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-22T21:06:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!