కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:12 PM

ఈ మధ్య గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ ఐపీఎల్‌లో ఓ టీమ్‌ని కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఐపీఎల్‌లో లేకపోతేనేం.. ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్ హైదరాబాద్ టీమ్‌ని సెట్ చేశారు. ఇంతకీ ఐఎస్‌పీఎల్‌ అంటే ఏమిటని అనుకుంటున్నారా? ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. ఈ ఐఎస్‌పీఎల్‌ గురించి తాజాగా చరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Global Star Ram Charan

ఈ మధ్య గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ (Ram Charan) ఐపీఎల్‌ (IPL)లో ఓ టీమ్‌ని కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీకి సంబంధించి వైజాగ్ పేరుతో రామ్ చరణ్ ఓ కొత్త టీమ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అలాంటిదేమీ లేదని ఆ తర్వాత వివరణ వచ్చిందనుకోండి. అయితే ఐపీఎల్‌లో లేకపోతేనేం.. ఐఎస్‌పీఎల్‌ (ISPL)లో రామ్ చరణ్ హైదరాబాద్ టీమ్‌ని సెట్ చేశారు. ఇంతకీ ఐఎస్‌పీఎల్‌ అంటే ఏమిటని అనుకుంటున్నారా? ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (Indian Street Premier League). టీ 10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌. ఈ ఐఎస్‌పీఎల్‌‌తో ఇన్నిరోజులు వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఈ ఐఎస్‌పీఎల్‌‌లో టీమ్ హైదరాబాద్‌ యాజమానిని అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నానని తాజాగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ వేదికగా తెలియజేశారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి ఆయన ఎగ్జయిట్ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఓవర్లు, 50 ఓవర్లు, టెస్ట్, రంజీ.. ఇలా అనేక ఫార్మెట్లలో క్రికెట్ ఆట ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. అయితే ఈ ఐఎస్‌పీఎల్‌ మాత్రం T10 అంటే 10 ఓవర్ల మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఎవరని అనుకుంటున్నారా? (Ram Charan Insta Post Goes Viral)


మీకు క్రికెట్ ఆట తెలిసి ఉంటే, క్రికెట్ బాగా ఆడటం వస్తే.. మీరే ఇందులో ఆటగాడిగా కొనసాగవచ్చు. అవును వీధిలో ఆడుకునే కుర్రకారు కోసమే ఇది క్రియేట్ అయినట్లుగా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. వీధి క్రికెట్ స్ఫూర్తిని చాటేలా, సమాజ స్ఫూర్తిని నింపేలా.. ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌. హైదరాబాద్ ఉనికిని చాటేలా, మెమరబుల్ క్షణాలను, ప్యాషన్‌ను బయటికి తెలియజేసేందుకు నాతో కలిసి రావాలనుకున్నవారు వెంటనే రిజిస్టర్ అవండి అంటూ రామ్ చరణ్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. స్ట్రీట్ టు స్టేడియం (#Street2Stadium), న్యూటీ10ఎరా (#NewT10Era) అనే ట్యాగ్స్‌ను కూడా ఆయన జత చేశారు. (Ram Charan ISPL Hyderabad Team Owner)

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో భాగం కావటంపై రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘ఐఎస్‌పీఎల్‌లో భాగం కావటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. క్రికెట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇది సరికొత్త పుంతలు తొక్కించనుంది. అసాధారణమైన క్రికెట్ ప్రతిభను హైదరాబాద్ ముందు నుంచి కేంద్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో ప్రతిభను నిరూపించుకోవటానికి ఈ క్రికెట్ లీగ్ ఒక గొప్ప వేదికగా కనిపించనుంది. నేను హైదరాబాద్ టీమ్‌ను సొంతం చేసుకోవటం నాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. మన నగరానికి క్రికెట్ ఆటపై ఉన్న ఆసక్తిని ప్రదర్శించడానికి ఇదొక గొప్ప వేదిక’’ అన్నారు. Players are encouraged to register here: www.ispl-t10.com

రామ్ చరణ్‌ (హైదరాబాద్)తో పాటు అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), అమితాబ్ బచ్చన్ (ముంబై) వంటి స్టార్స్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయటానికి పలు టీమ్స్‌ని సొంతం చేసుకోవటం విశేషం. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబై నగరంలో జరగనుంది. ఇందులో ఆరు టీమ్స్ - హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) మధ్య ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పెంపొదించేలా 19 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అండర్ 19 ఏజ్ గ్రూప్ కేటగిరీ నుంచి కనీసం ఒక ఆటగాడిని పదకొండు మంది ఉన్న టీమ్‌లో చేర్చడం మినహా ఎటువంటి వయస్సు పరిమితులు లేవు. ISPL దేశవ్యాప్తంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సరికొత్త వేదికగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

====================

*RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు

******************************

*Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది

********************************

*Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్

*****************************

*Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది

***************************

Updated Date - Dec 24 , 2023 | 12:19 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!