సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

ABN, First Publish Date - 2023-03-26T10:43:41+05:30

ఎన్‌.టి.రామారావు (NT RamaRao), కాంచన (Kanchana) హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలిసొచ్చిన అదృష్టం’ (Kalisochina Adrushtam) (10-08-1968) చిత్రం లోనిది ఈ స్టిల్‌.

NTR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌.టి.రామారావు (NT RamaRao), కాంచన (Kanchana) హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలిసొచ్చిన అదృష్టం’ (Kalisochina Adrushtam) (10-08-1968) చిత్రం లోనిది ఈ స్టిల్‌. కె.విశ్వనాథ్‌ (K.Viswanath), ఎన్‌.టి.రామారావు కాంబినేషన్‌లో మొదటి చిత్రమిది. అగ్రశ్రేణి తారాగణానికి బలమైన సెంటిమెంట్‌ తోడైతే మంచి చిత్రాలు వస్తాయనేందుకు నిదర్శనం. పెంచలేక తన బిడ్డను రావు బహద్దూరుకు పురిట్లోనే ఇచ్చేసింది ఓ తల్లి (పి.శాంతకుమారి).

ఆ బిడ్డే పెరిగి పెద్దవాడయిన ప్రకాష్‌ (ఎన్‌.టి.రామారావు). తన జన్మరహస్యం తెలుసుకున్న సన్నివేశంలో, అన్న (సత్యనారాయణ)ను ఏనాటికైనా ఒక దారికి తెచ్చి కుటుంబాన్ని చెదిరిపోకుండా నిలపాలన్న లక్ష్యాన్ని తెరమీద ఎన్‌.టి.ఆర్‌. ప్రాణం పోశారు. సినారె రాసిన ‘అమ్మా! నువ్వు నా అమ్మవు కావా అమ్మా!’ పాట సన్నివేశంలో రామారావు జీవించారు. నటన అంటే నిజ జీవితంలో చేయలేనిది, చేయనిది, తెర మీద మాత్రమే చేసేది అనుకుంటే, ఎన్‌.టి.ఆర్‌. ఈ చిత్రంలోని ప్రకాష్‌ పాత్రకు అన్ని విధాలా సరిపోయి అద్భుతంగా నటించారు. పి.శాంతకుమారి తల్లిగా, ఎన్‌.టి.ఆర్‌ కొడుకుగా నటించిన ఏ చిత్రమైనా ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేస్తుందని మరోసారి తెలియజేసిన చిత్రమిది!

ఇవి కూడా చదవండి:

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Updated Date - 2023-03-26T10:47:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!