సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Golden Globe: జగన్ ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్‌కు నెటిజన్స్ కౌంటర్స్

ABN, First Publish Date - 2023-01-11T19:54:12+05:30

ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌‌కు రాష్ర ప్రభుత్వం చివరి నిమిషం దాకా అనుమతులు ఇవ్వడం లేదు. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ఇలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇటువంటి తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్‌ను ఏపీ సీఎం. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రశంసించడంతో నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని కొంత కాలంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో టిక్కెట్ రేట్స్‌ను తగ్గించి పరిశ్రమను ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేసింది. వినోదాన్ని సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యమని చెప్పింది. ఓటీటీలు అతి తక్కువ ధరలో ఆడియన్స్‌కు అందుబాటులో ఉన్నప్పుడు ఈ టిక్కెట్ ధరలు న్యాయమేనని వాదించింది. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరైనా గొంతెత్తితే వారిపై కత్తిని దూసింది. అప్పట్లో నాని, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఫలితంగా ఆ సమయంలో విడుదలైన ఈ ఇద్దరి హీరోల చిత్రాలు పెట్టిన పెట్టుబడిని రాబట్టలేకపోయాయి. పలు మార్లు చర్చలు జరిపిన తర్వాత ఏపీ ప్రభుత్వం టిక్కెట్స్ ధరలను పెంచింది. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న దశలో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌‌కు రాష్ర ప్రభుత్వం చివరి నిమిషం దాకా అనుమతులు ఇవ్వడం లేదు. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ఇలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇటువంటి తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్‌ను ఏపీ సీఎం. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రశంసించడంతో నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’’ అని జగన్ తెలిపారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రిలీజ్ అయిన ప్రతి సినిమాకీ పెంట పెంట చేసి ఇప్పుడు వాటేసుకుంటున్నావా...??#షేమ్లెస్’’ అని ఆయన తెలిపారు. ‘‘ఆయనకు సరదా’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ చెప్పారు. జగన్ ట్వీట్‌‌పై సింగర్ అద్నాన్ సమీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు పతాకమా..? మీరు చెబుతున్నది భారతీయ పతాకమో కదా..? ప్రపంచం విషయానికి వస్తే మనమంతా ఒకే దేశం. మొదట మనం భారతీయులం. దయచేసి మీరు భారత్ నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి. మనం 1947లో చూసిన వేర్పాటు వాద వైఖరి మంచిది కాదు. ధన్యవాదాలు.. జై హింద్’’ అని అద్నాన్ సమీ తెలిపారు.

Updated Date - 2023-01-11T19:59:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!