కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Namrata and Sitara: మానీక్విన్స్ బొమ్మల కొలువులో నమ్రత, సితూ పాప సందడి

ABN, First Publish Date - 2023-09-30T20:31:20+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె నమ్రతా శిరోద్కర్‌తో కలిసి అతిపెద్ద మ్యాక్స్ ఫ్యాషన్ మానీక్విన్స్ బొమ్మల కొలువు‌ను ప్రారంభించారు.

Namrata Mahesh and Sitara at Max Fashion Event

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె నమ్రతా శిరోద్కర్‌తో కలిసి అతిపెద్ద మ్యాక్స్ ఫ్యాషన్ మానీక్విన్స్ బొమ్మల కొలువు‌ను ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా కలిగిన అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) స్టోర్స్ ఆంధ్ర మరియు తెలంగాణలో కలిపి ఈ సంవత్సరం ఎండింగ్‌కి 82 చేరనున్నాయి. దీంతో ముందే దసరా ఉత్సవాలను మానీక్విన్స్ బొమ్మల కొలువు (Bommala Koluvu)తో మ్యాక్స్ ఫ్యాషన్ శనివారం ప్రారంభించింది. హార్ట్ ఆఫ్ హైదరాబాద్‌ అయిన కెపిహెచ్‌బి నెక్సస్ మాల్‌లో 30 x 40 అడుగుల భారీ బొమ్మల కొలువును సితార ఘట్టమనేని శనివారం ప్రారంభించింది.

లేటెస్ట్ ఫ్యాషన్స్‌తో వినియోగదారులను ఆకర్షించేలా.. అతి తక్కువ ధరే లక్ష్యంగా నెల రోజుల పాటు ఈ మ్యాక్స్ వేడుకలు జరుగనున్నాయి. 150కి పైగా మానీక్విన్స్ (బొమ్మలు)తో కూడిన బొమ్మల కొలువును నమ్రతా శిరోద్కర్‌ (Namrata Shirodkar)తో కలిసి సితార ఆవిష్కరించారు. ఈ మానీక్విన్స్ ప్రతీది ఒక ప్రత్యేకమైన కథను వివరిస్తుండటంతో పాటు మ్యాక్స్ యొక్క తాజా పండుగ కలెక్షన్‌తో ఇవి అలంకరించబడ్డాయి. అంతేకాదు, ఈ కార్యక్రమంలో బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ.. ఎన్జీవోల నుండి పిల్లలు మరియు వృద్ధులకు దసరా కానుకలను సితార చేతుల మీదుగా అందజేశారు.


ఈ సందర్భంగా.. అతిపెద్ద బొమ్మల కొలువు మరియు దసరా ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రారంభించడం వెనుక అసలు కారణం.. మా కస్టమర్‌లకు షాపింగ్‌ విషయంలో సంతోషాన్ని అందించడమే లక్ష్యమని ల్యాండ్‌మార్క్ గ్రూప్ మ్యాక్స్ ఫ్యాషన్‌ - ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ హెడ్ పల్లవి పాండే తెలపగా.. హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను ప్రారంభించడం పట్ల మ్యాక్స్ ఫ్యాషన్ రీజినల్ బిజినెస్ హెడ్ పెద్దిరాజు ఆనంద్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి మానీక్విన్స్ బొమ్మల కొలువుతో మ్యాక్స్ ఫ్యాషన్ ప్రచారంలో భాగమైనందుకు నమ్రత, సితార తమ సంతోషాన్ని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని

************************************

*Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది

************************************

*Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్

************************************

*Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?

***************************************

Updated Date - 2023-09-30T20:31:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!