కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Charan Arjun: రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది

ABN, First Publish Date - 2023-12-03T18:45:42+05:30

తెలంగాణ ఎన్నికలలో రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Revanth Reddy and Charan Arjun

తెలంగాణ ఎన్నికలలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ (Charan Arjun). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో (Telangana Assembly Elections) కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘2009లో దర్శకుడు ఎన్. శంకర్‌ (N Shankar)గారి ద్వారా చంద్రబాబు నాయుడు‌గారు నాకు పరిచయం, అప్పటి నుండి ఆయనతో సన్నిహితంగా ఉన్నాను. నా స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డ్ నా పాటకు రావడం, ఆ అవార్డ్‌ను చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)‌గారి చేతుల మీదుగా అందుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నాతో సొంత స్టూడియోను కూడా చంద్రబాబు గారు పెట్టించారు. 2014‌లో రేవంత్ రెడ్డి అన్న‌తో పరిచయమవడం, ఆయన కోసం పాటలు చేయడం జరిగింది. అప్పటి నుండి రేవంత్ రెడ్డి అన్నతో సన్నిహితంగా ఉన్నాను. ఆ సమయంలో ‘తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరవబోదు ఈ గడ్డ’ సాంగ్‌ను రాశాను. రేవంత్ రెడ్డి‌గారు జైల్‌లో ఉన్నప్పుడు ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. అదే సమయంలో నన్ను వేరే వారు సాంగ్స్ చేయమని అడిగినా కూడా నేను చేయలేదు.


సందర్భం ఏదైనా రేవంత్ రెడ్డి అన్న నాతో పాట రాయించుకొనేవారు, అన్న పీసీపీ అధ్యక్షుడు అయ్యే రోజు మూడు రంగుల జండా అనే పాటను రాయడం జరిగింది. పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి ఈ పాట ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ‌గారు, ప్రియాంక గాంధీగారు ఈ సాంగ్‌ను ఎంతో మెచ్చుకున్నారు. ఈ పదేళ్ళలో జరిగినవన్నీ రేవంత్ అన్న నాకు చెప్పారు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక కళాకారుడిగా నేను రేవంత్ అన్నతో ఉన్నాను. ఈరోజు ఆయన విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది, ఇదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అని రచయిత, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. సినిమాల ద్వారా నేను నాలెడ్జ్ సంపాదించుకున్నాను, ఎంతో పేరు తెచ్చుకున్నాను. ‘విమానం, భీమదేవరపల్లి’ బ్రాంచి సినిమాలతో గుర్తింపు వచ్చింది. అలాగే ఇండిపెండెంట్ సాంగ్స్‌తో ప్రజల్లో మంచి పేరు వచ్చింది. రేవంత్ అన్న ద్వారా నాలాంటి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. కళారంగం అభివృద్ధికి నా వంతుగా ప్రభుత్వం అండతో రచయితలు, కవులు, గాయకులను వెలికితీయాలనేది నా కోరిక అని చరణ్ అర్జున్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్

***********************************

*Shah Rukh Khan: ‘డంకీ’ సాంగ్‌పై షారూక్ భావోద్వేగం

************************************

*Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?

*************************************

*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

***********************************

Updated Date - 2023-12-03T18:53:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!