సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?

ABN, First Publish Date - 2023-06-01T17:12:10+05:30

మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం వారు చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. మూగ జీవాల సంరక్షణార్థం వారంతా పశువులకు దాణాని, వానరాలకు శనగలు, అరటిపళ్లను అందించారు.

Super Star Krishna and Mahesh Babu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాన్స్ అందు మహేష్ బాబు ఫ్యాన్స్ (Mahesh Babu Fans) వేరయా! అని నిరూపించుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఫ్యాన్స్. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ.. గ్రామాల దత్తత, వెయ్యికి పైగా చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ బాబు (Mahesh Babu).. ఎన్నో కుటుంబాలకు దేవుడిగా నిలిస్తే.. ఆయన అభిమానులు కూడా ఇప్పుడదే మార్గంలో నడుస్తున్నారు. ఇంతకీ మహేష్ అభిమానులు ఏం చేశారో తెలుసా?

మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని మురళీకృష్ణ మహేష్ యువసేన (Murali Krishna Mahesh Yuvasena) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం మూగ జీవాల సంరక్షణార్థం జంగారెడ్డిగూడెం (Jangareddigudem)లో పశువులకు, వీధి కుక్కలకు దాణాని.. ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) మండలం జి కొత్తపల్లి అడవుల్లోని వానరాలకు అరటిపళ్ళు, వేరుశనగలను ఆహారంగా అందిందారు. మహేష్ యువసేన (Mahesh Yuvasena) చేసిన ఈ పనిని ఇప్పుడందరూ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాములుగా సేవ అనగానే అనాథ, వృద్ధాశ్రమలలో పండ్లు పంచడం, బ్లడ్ డొనేట్ చేయడం చేస్తుంటారు. కానీ మూగ జీవాలకు ఆహారం అందించాలనే థాట్.. నిజంగా అభినందనీయం అంటూ మహేష్ ఫ్యాన్స్‌‌ని అంతా అభినందిస్తున్నారు. ఇదే కాదు.. మజ్జిక చలివేంద్రం, అన్నసమారాధన వంటి కార్యక్రమాలను కూడా వారు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేష్ యువసేన అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ (Bavirishetty Murali Krishna) మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood)లో అనేక మార్పులు తీసుకురావడంలో కృష్ణ తనదైన పాత్ర పోషించారు. తోటి నటీనటులతో పోటీపడుతూ ఇండస్ట్రీలో అనేక మార్పులు తెచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా చరిత్ర సృష్టించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ.

ఆయనను స్మరించుకుంటూ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మూగజీవాలకు ఆహారం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అభిమానులందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎం రమేష్, ఎస్ పవన్ చారి, షేక్ సుభాని, పి రాధాకృష్ణ, ఎస్ ప్రశాంత్, ఏ సీతారామ్, డి సూరి తదితరులు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

*Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?

Updated Date - 2023-06-01T18:41:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!