Kiran Abbavaram: ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2023-01-13T18:39:18+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని.. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) శుక్రవారం
ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని.. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా ఆలయ ఆవరణలో ప్రదక్షిణలను నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆయనను పలువురు గుర్తించి ఆయనతో సెల్ఫీలు దిగారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2019లో తాను చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. రాజావారు రాణిగారు (Rajavaru Ranigaru) తన తొలి సినిమా అని, ఆ తర్వాత 2021లో ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘సెబాస్టియన్ పిసి 524’ అలాగే గతేడాది.. ‘సమ్మతమే, నేను మీకు బాగా కావలసినవాడిని’ చిత్రాలలో నటించినట్లు తెలిపారు. రానున్న శివరాత్రికి.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అనే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో.. ప్రేక్షకులు మెచ్చే విధంగా వారి ముందుకు రానున్నట్లు ఆయన వివరించారు. సంక్రాంతి పర్వదినాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో గడిపేందుకు తాను కుటుంబ సమేతంగా విచ్చేసినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఇందులో భాగంగా ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించడం తనకు ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.