కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

ABN, Publish Date - Dec 20 , 2023 | 04:34 PM

‘‘బిగ్ బాస్ షో లు టెలికాస్ట్ కాకుండా ఆపేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. ఆ షోలో డ్రగ్స్ కూడా వాడుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిజీపీ, పోలీసు కమిషనర్, డ్రగ్స్ నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ వారు ఈ షో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిఘా విభాగంను ఏర్పాటు చేయాలి’’ అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.

Bigg Boss Show

బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. అది నేడు రుజువైందని, ఇకనైనా ఈ షో పై మా ఆవేదనను అర్థం చేసుకుని.. ఈ షో ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (Kethireddy Jagadishwar Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

‘‘బిగ్ బాస్ 3 జరుగుతున్న సందర్భంగా 2019లో మొదట తెలంగాణ హైకోర్టు నందు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్ నందు.. బిగ్ బాస్ సెలెక్షన్స్ పేరుతో అమ్మాయిలను వంచించుచున్నారని.. ఈ బిగ్ బాస్ షో సమాజానికి ఎంతో హనికరం అని తెలియపర్చడం జరిగింది. ముఖ్యంగా యువత చెడు మార్గంలో నడిచేదానికి ఈ షో కారణం అవుతుందని, ఎందరో తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకొన్న తర్వాత ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలలో బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలని కోరుతూ అటు ప్రజా పోరాటాలు, ఇటు న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ షో ని ఇకపై రద్దు చేయాలి.


24 గంటలు ఒక రూంలో కొంతమందిని బంధించి, వాళ్లకు పిచ్చిపిచ్చి టాస్క్‌లు ఇచ్చి, పిచ్చివాళ్లుగా తయారు చేస్తున్నారు. 24 గంటలు షూట్ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం.. ఓటింగ్ పేరుతో జరుగుతున్న అవకతవకలు.. గేమ్ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు, హగ్గులు, ముద్దులు పెట్టుకుంటున్నారనే విషయాలను సమాజం దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు సాగిస్తూనే ఉన్నాం. వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని ఈ షో నిర్వాహకులు విచ్చలవిడిగా నడుచుకుంటున్నారని అభ్యంతరం తెలపటం జరిగింది. ఈ షో లు టెలికాస్ట్ కాకుండా ఆపేసే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. ఆ షోలో డ్రగ్స్ కూడా వాడుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిజీపీ, పోలీసు కమిషనర్, డ్రగ్స్ నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ వారు ఈ షో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిఘా విభాగంను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి, అధికారులకు త్వరలో తెలియజేయనున్నాను. ఈ షో నిర్వాహకులకు ఒక్కటే చెబుతున్నాను. మీకు దమ్ముంటే 2 రాష్ట్రాలలోని ప్రజల మధ్య, ప్రజా కోర్ట్‌లో ఓపెన్ డెబిట్ పెట్టి మీ షో పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలి’’ అని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vijay Kiragandur: ‘కాంతార’కే కాదు.. ‘సలార్’ విషయంలోనూ అంతే!

******************************

*ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ఇదేం ట్విస్ట్..

******************************

*Amardeep: కోపం ఉంటే చెప్పండి.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా?

**********************************

*Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్ అంటూ వార్తలు.. ‘నేనేం తప్పు చేశా’ అంటూ వీడియో వదిలిన విన్నర్

*********************************

Updated Date - Dec 20 , 2023 | 04:34 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!