Kajal Aggarwal: కూకట్‌పల్లిలో నటి కాజల్ అగర్వాల్ సందడి.. ఏం చేసిందంటే..
ABN, First Publish Date - 2023-12-16T19:02:12+05:30
హైదరాబాద్, కూకట్‌పల్లిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేశారు. రీ ఎంట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్.. షోరూమ్స్ ఓపెనింగ్స్‌లోనూ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆమె ఓ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్‌ను లాంఛ్ చేశారు.
హైదరాబాద్, కూకట్‌పల్లిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సందడి చేశారు. కూకట్‌పల్లిలోని పి.ఎన్.ఆర్ ఫస్ట్ ఫ్లోర్లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి శుభాకార్యానికి రకరకాల బంగారు ఆభరణాలు, వజ్రభరణాలు కోసం ఎక్కువ షాప్స్ తిరిగే అవసరం లేకుండా చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్‌ని మహిళలు కోసం దేవి పవిత్ర షోరూం ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. షోరూం చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్‌ని మా మహిళలు కోసం ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి ప్రత్యేకంగా అభినందనలు. షోరూంలో ఉన్న బ్రెయిడల్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. డైమండ్ సెట్ ధరించి చూశాను.. చాలా బాగుంది. నేను కూడా ఇకపై ఈ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలోనే కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యాను. హైదరాబాద్‌లోని, అలాగే చుట్టుప్రక్కల ఉన్న మహిళలు తప్పక విచ్చేసి.. ఈ షోరూంలోని గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్స్‌ను వీక్షించి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నానని అన్నారు.
ఈ సందర్భంగా షోరూం నిర్వహకులు మాట్లాడుతూ.. మా మొదటి షోరూమ్ విజయవాడలో స్థాపించగా.. చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ కూకట్‌పల్లిలో మా షోరూమ్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. మా కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నాం. వివాహాది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలిసి వచ్చేలా ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. మా వద్ద రాజసం ఉట్టిపడే విక్టోరియన్ కలెక్షన్స్‌తో పాటు పోల్కి డైమండ్స్, నగిషీ, కుందన బ్రైడల్ జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయి. అన్ని శుభాకార్యలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వెరైటీ డిజైన్లతో ఆభరణాలను రూపొందించి అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Salaar: ‘సలార్’ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. సినిమా ఎక్కడ చూడబోతున్నారో తెలుసా?
************************************
*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్
*************************************
*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ
*********************************
*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!
***********************************