Producers: నిర్మాతలూ.. మీకు ఈ రైట్స్ గురించి తెలుసా? తెలియకపోతే..
ABN, First Publish Date - 2023-10-11T19:34:55+05:30
‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - కాపీ రైట్స్’కు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు తాము నిర్మించే సినిమాలకు సంబంధించిన పలు రకాల ఆదాయ మార్గాలపై నిర్మాతలకు అవగాహన కల్పించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో ప్రొడ్యూసర్ బజార్ అక్టోబర్ 14న హైదరాబాద్‌లో అవగాహన సదస్సును నిర్వహించబోతున్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి, జీవితాలను పణంగా పెట్టి.. మీరు నిర్మించే సినిమాలపై మీరు ఏవిధమైన, ఎన్ని రకాల హక్కులు కలిగి ఉంటారో మీకు సరైన అవగాహన ఉందా? మీ సినిమాలకు సంబంధించిన పూర్తి ఆదాయ మార్గాలు మీకు తెలుసా? ఇప్పుడు మీరమ్మే కొన్ని రకాల రైట్స్‌కు... భవిష్యత్తులో పుట్టుకొచ్చే రైట్స్‌కు కూడా అప్లై అవుతాయా? గతంలో మీరు అమ్మిన సినిమాలపై కూడా ఇంకా మీరు కొన్ని హక్కులు కలిగి ఉంటారా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం, సమగ్ర అవగాహన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో ప్రొడ్యూసర్ బజార్.. ‘IP Rights & Copyrights in cinema’ అనే అంశంపై అక్టోబర్ 14న అవగాహనా సదస్సును నిర్వహించబోతోంది. (Tollywood Producers)
ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు (Dil Raju) అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగే ఈ సదస్సులో ఐ.పి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) స్ట్రాటజిస్ట్ మరియు సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్, ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె. తిరునావుకరసు పాల్గొని... నిర్మాతల, దర్శకుల, రచయితల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక సినిమాకు ఉండే ‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - కాపీ రైట్స్’ (IP Rights and Copyrights)కు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు తాము నిర్మించే సినిమాలకు సంబంధించిన పలు రకాల ఆదాయ మార్గాలపై నిర్మాతలకు ఇందులో అవగాహన కల్పించనున్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*University: ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’కి అంతా క్లియర్.. ప్రముఖులకు ప్రివ్యూ
**********************************
*Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది
**********************************
*Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..
***********************************
*Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..
************************************