సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raj Madiraju: దర్శకుడు రాజ్‌ మదిరాజుకు ఘనంగా సన్మానం

ABN, First Publish Date - 2023-06-12T18:55:59+05:30

నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత రాజ్‌ మదిరాజుకు ఘనంగా సన్మానం జరిగింది. సోమవారం బంజారా హిల్స్‌లోని ఆయన కార్యాలయంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు ఆయనని ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం రాజ్‌ మదిరాజు దర్శకత్వంలో ‘కృష్ణా రామ’ అనే చిత్రం తెరకెక్కుతోంది.

Felicitation to Director Raj Madiraju
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత రాజ్‌ మదిరాజుకు ఘనంగా సన్మానం జరిగింది. సోమవారం బంజారా హిల్స్‌లోని ఆయన కార్యాలయంలో నేతాజీ యువజన సంఘం (Nethaji Yuvajana Sangham) సభ్యులు ఆయనని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ.. రాజ్‌ మదిరాజు దర్శకత్వంలో ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కృష్ణా రామ’ (Krishnarama) చిత్రం ఘనవిజయం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ నుమాన్, సయ్యద్ అక్బర్, గుత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌ మదిరాజు విషయానికి వస్తే.. తరుణ్ (Tarun) హీరోగా నటించిన ‘అంకుల్’ (Uncle) అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రుషి, ఆంధ్రా పోరి, ఐతే 2.0 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘కృష్ణా రామ’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు రచయిత కూడా ఆయనే. అంతేకాదు, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు


**************************************************************************

*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

*********************************************************************

*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

*********************************************************

Updated Date - 2023-06-12T18:55:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!