Sakhi: ‘సఖి’ ప్రారంభోత్సవంలో ఘట్టమనేని సిస్టర్స్ సందడి
ABN, First Publish Date - 2023-09-29T20:45:28+05:30
అనేక రకాల డిజైన్‌లు మరియు ప్యాట్రన్లతో సంప్రదాయ, సమకాలీన వస్త్ర సోయగాలను అందిస్తున్న ‘సఖి’ (Sakhi) ప్రత్యేకమైన షోరూమ్‌ని ఘట్టమనేని సిస్టర్స్ మంజుల, ప్రియదర్శిని రోడ్ నెం.1, కెపిహెచ్‌బిలో ప్రారంభించారు.
అనేక రకాల డిజైన్‌లు మరియు ప్యాట్రన్లతో సంప్రదాయ, సమకాలీన వస్త్ర సోయగాలను అందిస్తున్న ‘సఖి’ (Sakhi) ప్రత్యేకమైన షోరూమ్‌ని ఘట్టమనేని సిస్టర్స్ (Ghattamaneni Sisters) మంజుల (Manjula), ప్రియదర్శిని (Priyadarshini) (హీరో సుధీర్ బాబు భార్య) రోడ్ నెం.1, కెపిహెచ్‌బిలో ప్రారంభించారు. ఇది ఈ బ్రాండ్‌కు మూడవ షో రూమ్. ఈ షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం.. ‘సఖి’తో తమకున్న అనుబంధాన్ని ఘట్టమనేని సిస్టర్స్ షేర్ చేసుకున్నారు.
కట్టులోనే కనికట్టు చేసే అందం... చీర సొంతం. ఈ చీర సొబగుల నిలయం ఇండియా. కాంచీపురం, ఉప్పాడ, కోట, బనారసి, గద్వాలు వాటి ప్రాంతాల నేత శైలితోనే ఖ్యాతి గడించిన ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. ఇక పైత్వానీ, ఆర్గాంజస్, హాఫ్ చీరలు, ఘాగ్రాలు, డిజైనర్ చీరలు మొదలైన వాటి శైలి కూడా భిన్నం. ఈ విభిన్న వస్త్ర శ్రేణికి నిలయంగా ‘సఖి’ నిలుస్తుంది. దక్షిణాది సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే కంచి చేనేత చీరల కలెక్షన్‌కు ప్రసిద్ధి చెందినదిగా ‘సఖి’ నిలుస్తుందని.. ఇది తమ ఇష్టసఖి అని చెప్పుకొచ్చారు. (Sakhi 3rd Showroom)
ఇంకా ఈ షోరూం ప్రారంభోత్సవంలో పరమహంస పరివ్రాజకాచార్య వాసుదేవానంద గిరి స్వామి, యోగిని చంద్ర కాళీ ప్రసాద మాతాజీ (శ్రీ కాళీ వనాశ్రమం ఆశ్రమ అధిపతి) మరియు భాగవతుల వెంకట భార్గవ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ‘సఖి’ వ్యవస్థాపకులు రావులపల్లి దుర్గా చంద్రశేఖర్ మరియు రావులపల్లి సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ షోరూమ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జంట నగరాల్లో వివాహ మరియు డిజైనర్ దుస్తులు కోసం అగ్ర శ్రేణి గమ్యస్థానాలలో సఖి ఒకటి అని రమ్య రోహిణి అన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది
************************************
*Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్
************************************
*Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?
***************************************
*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీలో విడుదల డౌటే.. ఎందుకంటే?
***************************************