సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

ABN, First Publish Date - 2023-07-10T20:57:35+05:30

కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు, అవసరార్థులైన ప్రజలను ఎంతగానో ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో.. ఆదివారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన మొదటి శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లుగా మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు.

Free Cancer Screening Camp at Chiranjeevi Eye and Blood Bank
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ రంగంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). కేవలం తన అభిమానులు, సినీ పరిశ్రమ కార్మికులు అనే కాదు దాదాపు అన్నివర్గాల ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు, అవసరార్థులైన ప్రజలను ఎంతగానో ఆదుకున్న ఆయన.. సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ (Free Cancer Screening Camp) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో.. ఆదివారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌ (Chiranjeevi Eye and Blood Bank)లో మొదటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమ కార్మికులు, నటులు, సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించగా.. మొదటి శిబిరం జూలై 9న హైదరాబాద్‌లో జరిపారు. తదుపరి జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్‌లో ఈ శిబిరాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య, దొరై తదితరులు పాల్గొన్నారు. (Chiranjeevi Charitable Trust)


ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) మాట్లాడుతూ.. స్టార్ హాస్పిటల్ డాక్టర్ గోపీచంద్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, శ్రేయోభిలాషి. దాదాపు 25 ఏళ్ల నుంచి ఆయనతో మాకు పరిచయం ఉంది. ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన చిన్నపిల్లల గుండెలకు ఆపరేషన్ చేస్తుంటారు.. అలా ఎలా చేస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. మా బ్రదర్స్‌కి డాక్టర్లు అంటే చాలా గౌరవం. డాక్టర్లు లివింగ్ గాడ్స్.. మన కళ్ళ ముందు కనిపిస్తున్న నిజమైన దేవుళ్ళు వారే. గోపీచంద్‌గారు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మా అన్నయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లడ్ బ్యాంకులో చేయడం మాకు గర్వకారణం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకోని వారు కూడా చాలా మంది వస్తున్నారు. ఇలా ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశం లేకుండా ఉంటుంది. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచాం.. ఇప్పుడు ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందే క్యాన్సర్‌ను అరికట్టే అవకాశాన్ని తమకు కల్పించినందుకు గోపీచంద్ గారికి కృతజ్ఞతలు. సుమారు 20 ప్రాంతాలలో ఇదే విధమైన పరీక్షలు చేయబోతున్నారని తెలిసింది.. అలా పరీక్షలు చేసిన అన్ని పరీక్షలు నెగిటివ్ రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగితే చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని తెలిపారు.

స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ (Gopichand) మాట్లాడుతూ.. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి వచ్చిన నాగబాబుగారికి ధన్యవాదాలు. రెండు వారాల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారితో ఈ క్యాంపు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా ఎమోషనల్‌గా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, అభిమానులు మాత్రమే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వారు మాత్రమే కాదు ఫిలిం జర్నలిస్టులు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ అనే కాదు ఎలాంటి జబ్బు అయినా ముందే కనుక్కుంటే దాన్ని త్వరగా తగ్గించే అవకాశం ఉంటుంది. జబ్బు వచ్చాక మందులు వాడటం కంటే జబ్బు వచ్చే సూచనలు కనిపించినప్పుడు దాన్ని నివారించడం మంచిది. లక్షణాలు కనిపించిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక్కోసారి స్టేజ్ దాటిన తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ఈ కార్యక్రమాలను డిజైన్ చేసింది ముందుగానే క్యాన్సర్ లక్షణాలు ఏవైనా కనిపించినా, అనుమానం ఉన్నా, ట్రేస్ చేసి దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లడం కోసమే. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాము. దీనికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..

**************************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?

**************************************

*Deen Raj: ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం

**************************************

*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

**************************************

*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?

**************************************

Updated Date - 2023-07-10T20:57:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!