సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuchipudi Palav: దిల్ రాజు, ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ‘కూచిపూడి పలావ్’

ABN, First Publish Date - 2023-07-12T20:21:38+05:30

ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో ఏర్పాటు చేసిన ‘కూచిపూడి పలావ్’ను.. నిర్మాత దిల్ రాజు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సరికొత్త ఆవిష్కరణతో కూచిపూడి వెంకట్ తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోటల్ నిర్వహణలో ఎదురయ్యే అతి పెద్ద సవాల్ ఏంటయ్యా అంటే ‘వంట మాస్టర్స్’ (షెఫ్స్)ను మెయింటైన్ చేయడం. ఆ సవాలుకే సవాలు విసిరి... సంచలన విజయం సాధించారు, సాధిస్తున్నారు దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్. ‘రాజుగారి తోట, మారేడుమిల్లి’ హోటల్స్‌తో అసాధారణ విజయాలు అందుకున్న కూచిపూడి వెంకట్ (Kuchipudi Venkat)... తాజాగా ‘కూచిపూడి పలావ్’ (Kuchipudi Palav) అనే సరికొత్త ఆవిష్కరణతో తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేయనున్నారు.


ఆంధ్ర, తెలంగాణ, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, అర్జైంటైనా, ఆఫ్రికా, అమెరికా... ఎక్కడైనా సరే.. షెఫ్స్ లేకుండా (Chef-Less Kitchen) వేడివేడిగా అత్యంత రుచికరమైన, ఆరోగ్యవంతమైన పలావ్ వడ్డించే ‘హోటల్స్’ను దర్జాగా నిర్వహించుకునే అత్యద్భుత అవకాశాన్ని ఆయన అందిస్తున్నారు. కొన్నేళ్లుగా కూచిపూడి వెంకట్ చేస్తున్న పరిశ్రమ, పరిశోధనల ఫలితంగా రూపుదిద్దుకున్న ‘కూచిపూడి పలావ్’ ఇప్పుడు అమెరికాలోనూ కొలువుదీరింది.

ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో ఏర్పాటు చేసిన ‘కూచిపూడి పలావ్’ను.. నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju), తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Telangana Minister Errabelli Dayakar Rao) సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా గల భోజన ప్రియులకు తెలుగు రుచిని పరిచయం చేస్తున్న కూచిపూడి వెంకట్, రాజు మండపాటిలను ఈ ప్రారంభోత్సవం సందర్భంగా వారు అభినందించారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

Updated Date - 2023-07-12T20:21:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!