V Vijayendra Prasad: సీఎం కేసీఆర్ మిరాకిల్ క్రియేట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా హ్యాపీ!
ABN, First Publish Date - 2023-05-19T12:08:17+05:30
ప్రపంచం మెచ్చిన బాహుబలి (Bahubali), RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను తన కలంతో రచించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
తన పట్టుదల, ఆకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేస్తూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిజం చేస్తున్నారని అన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad).
ప్రపంచం మెచ్చిన బాహుబలి (Bahubali), RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను తన కలంతో రచించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాడిని కాదు.. కానీ స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్‌లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్‌గారు ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్. (V Vijayendra Prasad about New Secretariat)
ప్రస్తుతం ఆయన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం గురించి చెబుతూ.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయేంద్రప్రసాద్‌తో పాటు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!
*Liger: ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ దీక్ష విరమించారు.. ఎందుకో తెలుసా?
*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?
*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది
*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట
*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్