కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandra Mohan: నాన్న ఎప్పుడూ ఏం చెప్పేవారంటే.. - చంద్రమోహన్ కుమార్తె

ABN, First Publish Date - 2023-11-23T18:32:55+05:30

దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) సంస్మరణ సభ గురువారం హైదరాబాద్ FNCCలో నిర్వహించారు. ఈ సభకు పలువురు సినీ, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన చంద్రమోహన్ మృతి చెందిన విషయం తెలిసిందే. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Chandra Mohan Family

దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) సంస్మరణ సభ గురువారం హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన చంద్రమోహన్ మృతి చెందిన విషయం తెలిసిందే. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినీ, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ చంద్రమోహన్ ఎంత గొప్ప నటుడో తెలుసు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసిన యాక్టర్ అంటే అది చంద్రమోహన్ అంకులే. ఆయన ఎంత గొప్ప స్టార్ అనేది ఊహ వచ్చే వరకు తెలియలేదు. ఆయన నాకు పెదనాన్న కావడం గర్వకారణం. నాన్నగారు, కె. విశ్వనాథ్‌గారు, చంద్రమోహన్ అంకుల్ మన మధ్య లేరనేది బాధాకరమని అన్నారు.  (Chandra Mohan Samsmarana Sabha)

ఎంపీ రఘురామకృష్ణంరాజు (RRR) మాట్లాడుతూ.. ‘‘నేను, శోభన్ బాబు‌గారు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. శోభన్ బాబుగారికి చిత్రసీమలో తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. ఆయన సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయనతో విశ్వనాథ్, బాపు గారు అద్భుతమైన సినిమాలు చేశారు. సూపర్ స్టార్ హీరోలకు ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయనకు కూడా అన్ని హిట్స్ ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్టార్ డమ్ ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. కృష్ణ, చంద్రమోహన్, ఎన్టీఆర్ వీళ్లంతా 24 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళకు సినిమాయే ఫ్యామిలీ. అందరూ మనవాళ్ళు అని కలిసిపోయే మనిషి చంద్రమోహన్ అని తెలపగా.. చంద్రమోహన్ మేనల్లుడు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ మా మావయ్య చంద్రమోహన్ గారు, మా కుటుంబ సభ్యుల తరఫున థ్యాంక్స్. మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. 


చంద్రమోహన్ పెద్ద కుమార్తె మధుర (Madhura) మాట్లాడుతూ.. ‘‘నాన్నగారు ఎప్పుడూ చెప్పిన విషయం హార్డ్ వర్క్ మన బలం అని! ‘ప్రపంచం ఏమన్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా... నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు’ అని చెప్పేవారు. నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్నగారు. ఎప్పుడూ మాతో ఉంటారు. నాకు స్ఫూర్తిగా ఉంటారు. నా దృష్టిలో ఆయన ఎప్పుడూ లివింగ్ లెజెండ్. అందరి హృదయాల్లో ఆయన ఉంటారు’’ అని తెలపగా.. చంద్రమోహన్ రెండో కుమార్తె మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘‘నాన్న కర్మయోగి. ఆయన నిర్మాతల ఆరిస్ట్. ఆయనను మనసులో తలుచుకున్న వ్యక్తులు అందరూ మాతో ఉన్నట్లు మేం భావిస్తాం. మాకు ఎంతో మంది ఫోనులు చేశారు. ఆయన ప్రిన్సిపల్స్ కావడం ముఖ్యం. జీవితంలో ఎలా బతకాలో చాలా నేర్పించారు. ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులు అందరికీ థాంక్స్’’ అని అన్నారు.

చంద్రమోహన్ మనవరాలు చిన్మయి (Chinmayi) మాట్లాడుతూ.. మేం మద్రాసులో ఉండేవాళ్ళం. నాకు ఆరేడేళ్ళు వచ్చేవరకు ఆయన అంత పెద్ద యాక్టర్ అని నాకు తెలియదు. స్కూల్‌కి వచ్చి నన్ను పికప్ చేసుకునేవారు. సరదాగా ఆటలు ఆడేవారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని ఎప్పుడూ చెప్పేవారు. తాతయ్య‌గారు నేర్పించిన విలువలు ఎప్పుడూ మాతో ఉంటాయి. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారని అనుకోవడం లేదు. మాతో ఉంటారు అని భావోద్వేగానికి లోనుకాగా, మరో మనవరాలు శ్రీకర (Srikara) మాట్లాడుతూ.. తాతయ్య గారితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను, అక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. మాతో పాటు గేమ్స్ ఆడేవారని అన్నారు. ఇంకా ఈ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని చంద్రమోహన్‌కు నివాళులు అర్పించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!

****************************

*Panja Vaishnav Tej: కొడితే పదిమంది ఎగిరిపోయే తరహా ఫైట్లు ‘ఆదికేశవ’లో ఉండవ్..

****************************

*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది

*****************************

Updated Date - 2023-11-23T18:32:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!