కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bigg Boss 7: బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌-7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీరే..

ABN, First Publish Date - 2023-10-03T20:06:02+05:30

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ తమిళ 7వ సీజన్‌ ఆదివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఏడో సీజన్‌ అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇందులో మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

Kamal Haasan Bigg Boss Tamil Season 7 Host

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ తమిళ 7వ సీజన్‌ ఆదివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఏడో సీజన్‌ అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇందులో మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో సినీ నటుడు కూల్‌ సురేష్‌, పూర్ణిమ రవి, రవీణా, ప్రదీప్‌ ఆంటోని, నిక్సన్‌, వినుషా దేవి, మణిచంద్ర, అక్షయ ఉదయకుమార్‌, జోవిక విజయకుమార్‌, ఐషు, విష్ణు విజయ్‌, మాయా ఎస్‌.కృష్ణ, శరవణ విక్రమ్‌, యుగేంద్రన్‌ వాసుదేవన్‌, విచిత్ర, రచయిత బవ చెల్లదురై, అనన్య ఎస్‌.రావు, విజయ్‌ వర్మ ఉన్నారు. (Bigg Boss Tamil Season 7 Contestants)

ఈ 18 మంది కంటెస్టెంట్లలో వంద రోజుల పాటు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఎవరు అత్యధిక రోజులు ఉంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ 18 మందిలో 9 మంది పురుషులు, 9 మంది మహిళలున్నారు. అలాగే, వైల్డ్‌ కార్డు ద్వారా మరో ఇద్దరిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించే అవకాశం ఉంది. పైగా గత ఆరు సీజన్ల కంటే ఏడో సీజన్‌ మరింత రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఈ దఫా రెండు బిగ్‌ బాస్‌ హౌస్‌లు నిర్మించినట్టు సమాచారం.


రీసెంట్‌గా తెలుగులోనూ కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) మొదలైన విషయం తెలిసిందే. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న వారిలో కొంతమందిని హౌస్‌మేట్స్‌గా నాగార్జున ప్రకటిస్తూ వస్తున్నారు. కంటెస్టెంట్స్ వేరు, హౌస్‌మేట్స్ వేరు అంటూ.. అలాగే త్వరలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయని.. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పుకొచ్చారు. చూస్తుంటే తెలుగులోనూ రెండు బిగ్‌బాస్ హౌస్‌లు నిర్మించారేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే.. త్వరలో కొంత మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్‌కు యాడ్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

*********************************

*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

***********************************

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..


***********************************

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

Updated Date - 2023-10-03T20:06:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!