Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..
ABN, First Publish Date - 2023-03-15T17:46:07+05:30
సినీ నటుడు చిరంజీవికి చెందిన స్థల వివాదంపై మంగళవారం తెలంగాణ హైకోర్టు యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేసింది. వివాదంలో ఉన్న స్థలంలో..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు చిరంజీవి (Megastar Chiranjeevi)కి చెందిన స్థల వివాదంపై మంగళవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేసింది. వివాదంలో ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన 595 చదరపు గజాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా చిరంజీవి (Chiranjeevi)కి విక్రయించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సి.వి. భాస్కర్‌రెడ్డి (CV Bhaskar Reddy) ధర్మాసనం విచారణ చేపట్టింది. వివాదంలో ఉన్న స్థలాన్ని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ.. జీహెచ్‌ఎంసీ (GHMC)కి అప్పగించిందని, జీహెచ్‌ఎంసీకి ఇచ్చేసిన భూమిని మళ్లీ చిరంజీవికి విక్రయించారని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కోఆపరేటివ్ రిజిస్ర్టార్, జూబ్లీహిల్స్ సొసైటీ, జీహెచ్‌ఎంసీ తదితరులకు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiah) చిత్రం కూడా కోర్టు సీన్‌తోనే ప్రారంభం అవుతుంది. వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ కేసులో చిరంజీవి (Chiranjeevi) నిలబడాలంటే.. రూ. 25 లక్షలు అవసరం పడగా.. వాటికోసం ఫారిన్‌లో ఉన్న విలన్‌ని తీసుకురావడానికి చిరంజీవి అంగీకారం చేసుకుంటాడు. ఫారిన్ వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ రివీలవుతుంది. అలాగే ఇప్పుడు చిరంజీవి విషయంలో ఈ భూ వివాదం కూడా అనేక మలుపులు తిరుగుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
*********************************
*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?
*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది
*Dasara Trailer: ఇదీ ట్రైలర్ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!
*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..
*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి
*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?
* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్