సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

ABN, First Publish Date - 2023-07-29T17:43:11+05:30

నేటితరం పిల్లల ఆలోచనలు సృజనాత్మకతకు తోడు విభిన్నంగా ఉంటున్నాయని.. వాటిని అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటున్నా లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. పార్క్ హయాత్‌లో డైరెక్టర్ మారుతి కుమార్తె హియ దాసరి ఆర్ట్ షో‌ను సందర్శించిన ఆయన.. ఆమె టాలెంట్‌కు ఫిదా అయ్యారు.

Allu Aravind with Director Maruthi Family

నేటితరం పిల్లల ఆలోచనలు సృజనాత్మకతకు తోడు విభిన్నంగా ఉంటున్నాయని.. వాటిని అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటున్నా లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) అన్నారు. దర్శకుడు మారుతి (Director Maruthi) కుమార్తె హియా దాసరి (Hiya Dasari) గీసిన చిత్రాల ప్రదర్శన శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయాత్ హోటల్‌లో నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అరవింద్‌ హాజరయ్యారు. హియా గీసిన చిత్రాలను వీక్షించి ఆమె టాలెంట్‌ను ఆయన అభినందించారు.


ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న హియా దాసరి.. కామిక్, స్టోరీస్‌లోని జోకర్, బ్యాట్‌మెన్, తదితర క్యారెక్టర్లను ఇతివృత్తంగా చేసుకొని బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోడ్‌లో ది నోయిర్‌ రెండిజ్‌వోజ్‌ పేరుతో ఆర్ట్‌ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హియా మాట్లాడుతూ.. తాను 71 చిత్రాలు గీశానని, దీని కోసం 8 నెలల సమయం పట్టిందని అన్నారు. తన ప్రతిభ వెనుకాల తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని అంశాలపై తన చిత్రాలు ఉంటాయని హియా చెప్పుకొచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు, టీజీ విశ్వప్రసాద్, ప్రొడ్యూసర్ రవి శంకర్, నాగ వంశీ, హీరో ఆనంద్‌ దేవరకొండ, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్, నిర్మాత ఎస్‌కేఎన్, హీరోయిన్‌ వైష్ణవి, విరాజ్‌ తదితరులు పాల్గొని హియా దాసరి గీసిన చిత్రాలను వీక్షించారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

**************************************

*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

*************************************

* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

*************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

Updated Date - 2023-07-29T22:37:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!