Actress Death: పోస్టుమార్టంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. నటి కడుపులో ఉన్న ద్రవం ఏంటి?
ABN, First Publish Date - 2023-04-06T16:11:02+05:30
గత కొన్ని రోజుల క్రితం భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (Akanksha Dubey) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
గత కొన్నిరోజుల క్రితం భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (Akanksha Dubey) మృతి చెందిన విషయం తెలిసిందే. వారణాసిలోని ఓ హోటల్‌లో ఈ 25 ఏళ్ల నటి సూసైడ్ చేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఆమె మరణ వార్తపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం నటిది ఆత్మహత్య అయ్యి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. విచారించే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
తాజాగా నటికి సంబంధించిన పోస్టుమార్టం (Post mortem) బయటికి వచ్చింది. అందులో నటి కడుపులో ఏదో తెలియని ద్రవం ఉన్నట్లు, అలాగే చేతి మణికట్లుపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. నివేదిక ప్రకారం.. ఆకాంక్ష కడుపులో ఫుడ్‌గాని, లిక్విడ్‌గాని లేదు. కానీ, తాజాగా పోస్టుమార్టంలో దాదాపు 20 ఎంఎల్ పరిమాణంలో ఏదో బ్రౌన్ కలర్ ద్రవం ఉండడం, దాని వల్ల ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యి ఉంటుదని తెలిస్తోంది. అలాగే ఆకాంక్ష చేతి మణికట్టుపై గాయాలు ఉండడం అందరినీ షాక్‌కి గురి చేసింది. దీంతో ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని నటి లాయర్ శశాంక్ శేఖర్ త్రిపాఠి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. (unknown liquid in stomach)
Also Read:
Nayanthara: తన పిల్లల పూర్తి పేర్లు చెప్పేసిన నయన్.. ఇవేం పేర్లంటూ..
నివేదికల ప్రకారం, దివంగత నటి లాయర్ శశాంక్ ఆమె కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యానాథ్‌కి ఓ లేఖ రాసినట్లు సమాచారం. అలాగే.. ఆకాంక్ష సూసైడ్ చేసుకోలేదని, ఎవరో తనని హోటల్ గదిలో చంపేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోని పలువురు వ్యక్తులు తనతో పని చేయించుకుని దానికి డబ్బులు ఇవ్వలేదని, అందుకే బలవంతంగా ఆమె అంత్యక్రియలు చేయించారని విమర్శించారు. (Injury marks on wrist)
అంతకుముందు, ఆకాంక్ష తల్లి నటి బోయ్‌ఫ్రెండ్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్‌పై ఆరోపణలు చేయడంతో పాటు కేసు కూడా పెట్టింది. వారే తనని బెదింరించాడని అందులో పేర్కొంది. పోస్టుమార్టం వచ్చిన ఈ తరుణంలో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా.. ‘కసమ్ పైడా కర్నే వాలే కి 2’, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘వీరోన్ కే వీర్’ వంటి చిత్రాలతో ఆకాంక్ష భోజ్‌పురిలో మంచి గుర్తింపు సాధించింది.
ఇవి కూడా చదవండి:
SS Rajamouli: కీరవాణిని చూసి గర్వంగా ఫీలవుతున్న రాజమౌళి.. ఈసారి ఆస్కార్ గురించి కాదులెండి..
Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..
Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?